America: కరోనా మహమ్మారి ఇండియాలో తీవ్రరూపం దాలుస్తోంది. కరోనా నియంత్రణ విషయంలో భారత వైఖరిపై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పుడు అంచనాలే భారత్ కొంపముంచాయంటోంది.
ప్రపంచమే నిర్ఘాంతపోయేలా భారత్‌లో కరోనా విపత్కర (Corona situations)పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితి. కేసులు భారీగా పెరగడంతో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, అత్యవసర మందుల కొరత వెంటాడుతోంది. ఆక్సిజన్ అందక(Oxygen Shortage) కళ్లముందే ప్రాణాలు వదిలేస్తుంటే చూస్తూ ఉండిపోవల్సిన దయనీయ పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దేశ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ పరిస్థితిపై అమెరికా( America) అధ్యక్షుడు ముఖ్య వైద్య సలహాదారుడు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో కరోనా కట్టడిపై ముందస్తు తప్పుడు అంచనాలే కారణమని డాక్టర్ ఆంటోనీ ఫౌసీ(Dr Antony Fauci) స్పష్టం చేశారు. కరోనా అంతమైందన్న తప్పుడు అభిప్రాయంతో ఇండియాలో ప్రభుత్వాలు అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చాయని చెప్పారు. దాని ఫలితమే ప్రస్తుతం కరోనా వీరవిహారమని తెలిపారు. సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ పెన్షన్ కమిటీకు కోవిడ్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదనేది ఇండియాలో నెలకొన్న సెకండ్ వేవ్( Corona Second Wave) ద్వారా ప్రపంచానికి తెలుస్తోందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్యపరంగా అవసరమైన సన్నద్ధత, ఆరోగ్య రంగ మౌళిక వసతులు విస్తరించడం వంటి అవసరాల్ని ఇండియా ఉదంతం చెబుతోందన్నారు. ఏ దేశంలో వైరస్ ఆనవాళ్లున్నా..మొత్తం ప్రపంచమంతా విస్తరించే అవకాశమున్నందున అందరూ అప్రమత్తత పాటించాలన్నారు.
Also read: Mixing of Vaccines: రెండు వేర్వేరు కంపెనీ వ్యాక్సిన్‌లు ఇస్తే ఎలా ఉంటుంది..సరికొత్త ప్రయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook