Impeachment: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు చర్యలు సిద్ధమవుతున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తద్వాారా గడువుకు ముందే పదవి నుంచి దింపేందుకు ఆలోచన జరగుతోంది.
జో బిడెన్ ( Joe Biden ) ను అధికారికంగా ఎన్నుకునే ప్రక్రియ సందర్బంగా కేపిటల్ హిల్ ( Capitol Hill ) భవనంపై దాడి జరిగింది. హింస చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక ట్రంప్ ప్రమేయముందనేది ఆయనపై ఉన్న అభియోగం.
అందుకే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ను అభిశంసన తీర్మానం ( Impeachment ) ద్వారా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. తీర్మానానికి సంబంధించి చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికి పైగా మద్దతు కావల్సి ఉంది. హౌస్‌లో డెమోక్రట్లకు ( Democrats ) పూర్తి మెజార్టీ ఉండగా..ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదించినా...సెనేట్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. కానీ సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ల ( Republicans ) కే స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. ఈ నేపధ్యంలో అభిశంసన తీర్మానం ఏమవుతుందనేది వేచి చూడాలి.
Also read: Sex rules: బెడ్ రూమ్ సెక్స్ ఎలా చేయాలో చెబుతున్న ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook