Eswatini Prime Minister Dies: కరోనాతో ఎస్వాతిని ప్రధాని కన్నుమూత

Eswatini Prime Minister Dies With CoronaVirus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను నేటికీ వణికిస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికాలోని ఎస్వాతిని దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని(52) కరోనా మహమ్మారికి బలయ్యారు. సరైన కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ఇంకా శ్రమిస్తున్నారు.

Last Updated : Dec 14, 2020, 02:51 PM IST
  • కరోనాతో ఎస్వాతిని ప్రధాని కన్నుమూత
  • 4 వారాల కిందట కరోనా పాజిటివ్
  • ఆరోగ్యం క్షీణించడంతో మృతి
Eswatini Prime Minister Dies: కరోనాతో ఎస్వాతిని ప్రధాని కన్నుమూత

Eswatini Prime Minister Dies: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను నేటికీ వణికిస్తోంది. సరైన కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ఇంకా శ్రమిస్తున్నారు. కానీ సామాన్యులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార, ఇతరత్రా రంగాల సెలబ్రిటీలు కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికాలోని ఎస్వాతిని దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని(52) కరోనా మహమ్మారికి బలయ్యారు. 
 

Also Read:  Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి

2018 నవంబర్‌లో ఎస్వాతిని ప్రధానిగా ఆంబ్రోస్ దాదాపు నెలరోజుల కిందట కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. కోవిడ్-19 (COVID-19) పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. దీంతో ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. కానీ దాదాపు రెండు వారాల కిందటి వరకు ఆంబ్రోస్ లామిని ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు సైతం స్పందిస్తున్నారని చెప్పారు.

Also Read: COVID-19 Cases: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కానీ, గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రధాని ఆంబ్రోస్ లామిని తుదిశ్వాస విడిచారని ఎస్వాతినీ ఉప ప్రధానమంత్రి థెంబా అధికారికంగా ప్రకటించారు. మిలియన్ జనాభా కలిగిన ఎస్వాతీనీ దేశంలో ఇప్పటివరకూ 6700 మంది కరోనా బారిన పడగా 127 కరోనా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.

Also Read: Health Tips: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!

Trending News