Russia’s Second Vaccine: అద్భుత ఫలితాలు చూపిస్తున్న రెండో వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్న రష్యా ( Russia ) ఇప్పుడు రెండో స్థానం కూడా సాధించనుందా..ఎపివ్యాక్ కరోనా. కరోనాకు రష్యా అందిస్తున్న రెండవ వ్యాక్సిన్. హ్యూమన్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు కన్పిస్తున్నాయి.

Last Updated : Aug 22, 2020, 05:25 PM IST
Russia’s Second Vaccine:  అద్భుత ఫలితాలు చూపిస్తున్న రెండో వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందంజలో ఉన్న రష్యా ( Russia ) ఇప్పుడు రెండో స్థానం కూడా సాధించనుందా..ఎపివ్యాక్ కరోనా. కరోనాకు రష్యా అందిస్తున్న రెండవ వ్యాక్సిన్. హ్యూమన్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు కన్పిస్తున్నాయి.

స్పుత్నిక్ వి( Sputnik v ) పేరుతో ఇప్పటికే వ్యాక్సిన్ ను కనుగొన్నామని రష్యా చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపర్చింది. కొందరిని ఆందోళనలో నెట్టింది. చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడిక అదే కరోనా వైరస్ కు రెండవ వ్యాక్సిన్ ( second vaccine ) కూడా ప్రకటించుంది. రష్యాలోని వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ అభివృద్ది చేసిన ఎపివ్యాక్ కరోనా ( Epivaccorona ) హ్యూమన్ ట్రయల్స్ ( Human trials ) లో సురక్షితంగా కన్పిస్తోంది. ఫస్ట్ ఫేజ్లో ( first phase trials ) ఎపివ్యాక్ కరోనా తీసుకున్నవారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని రష్యాలోని ఫెడరల్ సర్వీస్ ఫర్ సర్వైలెన్స్ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి ఎపివ్యాక్ కరోనా వ్యాక్సిన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. Also read: The Shark: ఆ మహాసముద్రంలో కనుగొన్న ఆ సొరచేపకు..మనిషి వయస్సుకు సంబంధమా

తొలిదశలో మొత్తం 57 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని..అందులో 43 మంది ప్లేసిబో తీసుకున్నారని..అందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ వెల్లడించింది. 14-21 రోజుల వ్యవధిలో రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇమ్యూనిటీ పెరిగినట్టు గుర్తించామని సంస్థ తెలిపింది. 

తొలి వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine ) పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Russia president vladimir putin ) ప్రకటన చేసిన కొద్దిరోజులకే రెండో వ్యాక్సిన్ ఎపివ్యాక్ కరోనా వెలుగులోకి రావడం విశేషం. రెండు వ్యాక్సిన్ ల ప్రయోగాలు పూర్తిగా సక్సెస్ అయితే నిజంగా రష్యాను అభినందించాల్సిందే. రష్యా ఇప్పటికే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మూడోదశను భారీస్థాయిలో 40 వేల మందిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.  Also read: WHO: రెండు సంవత్సరాల్లో కరోనా అంతం

Trending News