earthquake strikes Mindanao Philippines: న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం ( earthquake ) సంభవించింది. మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. తెల్లవారుజామున 4.52 గంటల ప్రాంతంలో మిండనావో (Mindanao ) లో భూమి కంపించిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( National Centre for Seismology) వెల్లడించింది. Also read: Google ఫీచర్.. త్వరలో మీ మొబైల్‌కు భూకంపాల అలర్ట్స్
అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపంతో ఫిలిప్పీన్స్ ( Philippines ) ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఆగస్టు నెలలో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe