అది అక్కడే పుట్టింది.. ఆ దేశంపై మరోసారి విరుచుకుపడిన డోనాల్డ్ ట్రంప్..

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని

Last Updated : May 1, 2020, 11:59 PM IST
అది అక్కడే పుట్టింది.. ఆ దేశంపై మరోసారి విరుచుకుపడిన డోనాల్డ్ ట్రంప్..

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని, చైనాతో తలెత్తిన ఆర్థిక నష్టంపై తగు విధంగా తమ స్పందన ఉంటుందని, సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 

చైనా సృష్టితో ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అయ్యాయని, 2,33,000ల మందికి దీని ద్వారా మరణం సంభవించిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్ మానవ సృష్టేనని అయితే వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే అనుకోకుండా వెలువడిందని చెప్పడానికి ఆధారాలు లేవని ఒక్కరోజు క్రితమే అమెరికా నిఘా వర్గాలు గురువారం తెలిపాయి. 

అమెరికాలోని వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ నుండే ఈ వైరస్ బయటకు వెలువడిందని పూర్తి నమ్మకంతో చెప్పగలరా అని ట్రంప్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా  దీనికి గాను ట్రంప్ స్సందిస్తూ నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అయితే దీనిపై తాను ఇప్పటికిప్పుడు వివరాలను, ఆధారాలను పొందుపర్చడం కుదరదని తెలిపారు. అయితే ఈ అంశంపై తగు విధంగా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News