అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. తమకు నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ (Donald Trump Tests positive for COVID19)గా తేలిందని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అంతకుముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వద్ద సలహాదారిణిగా సేవలందిస్తున్న హోప్ హిక్సు కరోనా వైరస్ బారిన పడింది. లక్షణాలు రావడంతో టెస్టులు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులలో కంగారు మొదలైంది.
Also Read : Donald Trump: సిబ్బందికి కరోనా.. ట్రంప్ దంపతులకు కోవిడ్19 టెస్టులు
డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు కోవిడ్19 టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి తామిద్దరం క్వారంటైన్‌లోకి వెళ్లామని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మరో రెండు గంటల అనంతరం తమ కోవిడ్19 టెస్టుల ఫలితాలు వచ్చాయని.. తనతో పాటు భార్య మెలానియాకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Also Read: CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe