హైదరాబాద్: కరోనావైరస్‌ను (Coronavirus ) శునకాలు పసిగడతాయా అంటే అవుననే అంటోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. అవును.. శిక్షణ పొందిన జాగిలాలు కరోనావైరస్ సోకిన వారిని వెంటనే గుర్తిస్తున్నాయని చెబుతున్న యూఏఇ సర్కార్.. ఇప్పుడు ఏకంగా వాటిని ఉపయోగిస్తూ విమానాశ్రయాల్లో కరోనా పాజిటివ్ కేసులను సైతం గుర్తిస్తోంది. 92% నుంచి 94% శాతం కేసుల్లో జాగిలాలు పట్టుకున్న వారిలో కరోనావైరస్ లక్షణాలు గుర్తిస్తుండటం గమనార్హం. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కరోనావైరస్ సోకిన వారిని గుర్తించేందుకు విమానాశ్రయాల్లో 'కే9 ఫోర్స్' పేరుతో జాగిలాలను మోహరించింది. విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి సేకరించిన చమట వాసన ( Sweat smell ) చూసి.. వారికి కరోనా ఉందా లేదా అనే విషయాన్ని ఈ జాగిలాలు ఇట్టే పసిగట్టేస్తున్నాయి. Also read: Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?
విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి చమట శాంపిళ్లను సేకరించి వాటిని ఓ గదిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక చాంబర్లలో పెడతారు. ఆ తర్వాత ఈ జాగిలాలను ఆ గదిలోకి తీసుకెళ్తారు. అక్కడ వాసన చూసే క్రమంలో కరోనావైరస్ సోకిన వ్యక్తికి చెందిన చమట శాంపిల్ ( Sweat samples ) వద్దకు రాగానే అవి అక్కడి నుంచి కదలకుండా ఉండిపోతున్నాయి. ఆ జాగిలాలు ఎక్కడైతే ఆగిపోతాయో... ఆ వ్యక్తికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) నిర్వహిస్తున్నారు. ఎవరికైతే కరోనా పరీక్షలు చేస్తున్నారో.. వారికి దాదాపుగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. Also read: Chiranjeevi: చెల్లెళ్లను ఆట పట్టించిన చిరంజీవి
యుఏఇ ఇంచుకున్న ఈ విధానంపై ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టిసారిస్తున్నాయి. తమ జాగిలాలకు సైతం కరోనావైరస్‌ను గుర్తుపట్టే రీతిలో తగిన విధంగా శిక్షణ ఇస్తున్నాయి. జర్మన్ పరిశోధకులు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. జాగిలాలకు శిక్షణ ఇస్తే.. కరోనా రోగులను అవి కచ్చితంగా గుర్తించగలవు అంటున్నారు. Also read: lizard in Sambar: సాంబార్‌లో సగం బల్లి.. ఇంకో సగం ఏమైందంటూ కస్టమర్ టెన్షన్