Vaccine Effect On Menstrual Cycle: వ్యాక్సినేషన్ తరువాత మహిళల్లో కొత్త సైడ్ ఎఫెక్ట్స్.. అవేంటంటే..??

మహిళల్లో వ్యాకినేషణ్ తరువాత కొత్త రకం సైడ్ ఎఫెక్ట్స్​  వస్తున్నాయని వెలుగులోకి వచ్చింది. అవేంటో.. వాటినెల అధిగమించాలో మీరే చూడండి..!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 07:48 PM IST
  • అమెరికా మహిళల్లో వ్యాక్సిన్ కొత్త రకం సైడ్ ఎఫెక్ట్స్​
  • రుతుక్రమంపై ప్రభావం చూపుతుందని ఫిర్యాదు.
  • కొద్ది కాలం మాత్రమే ఈ ప్రభావం ఉంటుందన్న పరిశోధకులు
Vaccine Effect On Menstrual Cycle: వ్యాక్సినేషన్ తరువాత మహిళల్లో కొత్త సైడ్ ఎఫెక్ట్స్.. అవేంటంటే..??

Corona Vaccine side Effects in Womens: ప్రపంచ దేశాలని అతలాకుతలం చేసిన కరోనా మహామ్మారి.. (Corona Crisis)ప్రస్తుతం తగ్గు ముఖం పట్టిన, కొన్ని దేశాల్లో థర్ట్ వేవ్ (Corona Third Wave) కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ (Corona Vaccine) అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ, కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.  

వ్యాక్సిన్  వచ్చిందన్న సంతోషం ఎంత ఉందో.. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్​ (Corona Vaccine side effects) కూడా అంతే వస్తున్నాయి. వ్యాక్సిన్ వల్ల వచ్చే ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం సాధారణమే అయినప్పటికీ, ఇవి మాత్రమే కాకుండా వేరే సైడ్ఎఫెక్ట్స్​ కూడా వస్తున్నాయని అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకున్న కొంత మంది మహిళలు వాపోతున్నారు. 

Also Read: Viral Video: ఖబర్దార్ హస్బెండ్స్.. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇదే జరుగుతుంది!

వ్యాక్సిన్ వేసుకున్న తరువాత  రోగ నిరోధక శక్తి (Immunity Power) పెంచే క్రమంలో శరీరంలో యాంటీ బాడీల ఉత్పత్తి కారణంగా, ఇలాంటి సైడ్ ఎఫెక్టులు సాధారణం. కానీ అమెరికాలో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొత్తరకం సైడ్ ఎఫెక్ట్స్‌ అనగా పరిశోధకులు హెచ్చరించని మార్పులు కలుగుతున్నాయని తెలుపుతున్నారు. వీటిలో ముఖ్యంగా రుతు క్రమాల్లో (పీరియడ్స్‌లో) (Corona Vaccine effects on Menstrual Cycle) మార్పులు. 

పరిశోధకులు వ్యాక్సిన్ రుతు క్రమంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో అన్న అంశంపై పరిశోధన జరుపలేదని, ప్రస్తుతం తలెత్తుతున్న సమస్యపై డేటా తయారు చేస్తున్నామని తెలిపారు.  

Also Read: Gas Cylinder Price Increase: అక్టోబర్‌లో 60% పెరుగనున్న వంట గ్యాస్ ధరలు.. సామాన్యుల బ్రతుకే భారమాయే..!

ఇల్లానోయిస్ అర్బనా ఆంత్రపాలజీ ప్రొఫెసర్ కేట్ క్లాన్సీ, బయోలాజికల్(Biological) అంత్రపాలజిస్ట్ క్యాథీరీన్ లీ.. వ్యాక్సినేషన్​(Vaccination) అనే ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రుతుక్రమంలో వచ్చే మార్పులపై అధ్యయనాలు జరుపుతున్నారు. 40 వేల మందిలో ఈ మార్పులు గమనించామని, అన్ని ఆధారాలను ఒక డాక్యుమెంట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. క్యాన్సీ మొదటి డోసు తీసుకునన్న తరువాత పీరియడ్ పరంగా ఎదుర్కొన్న సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. గత 5 నెలలుగా ఆ ట్విట్ కు రిప్లేలు వస్తున్నాయని తెలిపారు. 

అయితే తనకు చాలా మంది ప్రపంచ దేశాల నుండి ఈ మెయిళ్లు, ఇన్​స్టాగ్రామ్​లో డైరెక్ట్ మెసేజ్ లు చేస్తునప్పటికీ, వ్యాక్సిన్ వల్లనే ఇలా జరుగుతుందన్న శాస్త్రీయమైన ఆధారాలు లేవని తెలిపింది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు, ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆఫీసర్లు (Food and Drug Officers) వ్యాక్సిన్ మహిళల పీరియడ్స్ పై ఎలాంటి ప్రభావం చూపదని నిర్దారించారు. 

Also Read: SBI Customers Uninstall these 4 Apps: ఈ 4 యాప్స్ వాడితే మీ డబ్బులు గోవిందా.. గోవిందా..!!

మేము గమనించిన కేసుల వివరాలను బట్టి చూస్తే వ్యాక్సిన్ ప్రభావం పీరియడ్స్ పైన ఎక్కువ కాలం ప్రభావం చూపదని, కేవలం రెండు పీరియడ్ల వరకి దీని ప్రభావం ఉంటుందని లీ, క్లాన్సీ తెలిపారు . అయితే వ్యాక్సిన్ వలన రుతుక్రమంపై పడే ప్రభావాన్ని గుర్తించి పరిష్కరించటమే తమ ఉద్దేశమని తెలిపారు.  

ఒత్తిడి, ఇతర అనారోగ్యాలు మరియు ఒకరి-ఇంకొకరికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ గైనకాలజిస్ట్ డాక్టర్​ లారా రిలే అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో తయారయ్యే కరోనా వ్యాక్సిన్లు, మందుల ట్రయల్స్​ జరిగే సమయంలో రుతుక్రమంపై ప్రభావం విషయాన్ని దృష్టి ఉంచుకుంటారని ఆశిస్తున్నట్టు డాక్టర్ రిలే చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News