Dinosaur takes to UN General Assembly podium to tell world leaders: Don’t choose extinction: అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (united nations general assembly) ఊహించని ఒక సంఘటన జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరిగే కావెర్‌నోస్ హాల్‌లోకి (cavernous hall) డైనోసర్ వచ్చింది. అక్కడి నుంచి నేరుగా పోడియం వద్దకు వెళ్లిన ఆ డైనోసర్ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన డైనోసర్(Dinosaur). ‘వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి కోరింది డైనోసర్.
వినండి ప్రజలారా.. వినాశనం అనేది చాలా చెడ్డ విషయమని చెప్పింది ఆ డైనోసర్. అది మానవాళిని అంతరించిపోయేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ 70 మిలియన్ సంవత్సరాల్లో (70 million years) తాను విన్న అత్యంత తెలివితక్కువ విషయం ఇదేనని చెప్పింది డైనోసర్ (Dinosaur).
మీరు వాతావరణ విపత్తు వైపు వెళ్తున్నారు.. ఇంకా ఏటా ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల సబ్సిడీల (fossil fuel subsidies) కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నాయి అని పేర్కొంది డైనోసర్. కానీ, ఆ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో (poverty)మగ్గిపోతున్న ప్రజలకు సాయంగా ఎందుకు ఉపయోగించట్లేదని ప్రశ్నించింది ఆ డైనోసర్.
Also Read : Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే...
మీ జాతి వినాశనానికి ఎందుకు డబ్బులు (Money) ఖర్చు చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ క్లాస్ పీకింది డైనోసర్. వినాశనాన్ని ఎంచుకోకండి. ఆలస్యం కాకముందే మీ జాతిని కాపాడుకోండి అని సలహా ఇచ్చింది. ఇకనైనా సాకులు చెప్పడం మానండి.. మార్పులను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ డైనోసర్ (Dinosaur) గట్టిగానే చెప్పింది.
We can no longer ignore the climate crisis.
It's time to stop making excuses and start making changes!
Let's take #ClimateAction before it’s too late: https://t.co/UaBpA8VLbn
via @UNDP #DontChooseExtinction pic.twitter.com/y2zZsSc0lB— United Nations (@UN) October 27, 2021
అయితే డైనోసర్ మాత్రం నిజంగా రాలేదండీ.. వాతావరణ మార్పులపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్.. (United Nations Development Programme) ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితిలో సమావేశం జరగనున్న నేపథ్యంలో యూఎన్‌డీపీ (UNDP).. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది.
గ్రాఫిక్స్‌లో డిజైన్ చేసిన ఈ వీడియోలో డైనోసర్‌కు (Dinosaur) ప్రముఖ సెలబ్రిటీలు పలు భాషల్లో వాయిస్ ఇచ్చారు. ఈ వీడియోను ఐరాస (United Nations) షేర్ చేయగా.. విపరీతమైన ఆదరణ లభించింది. కాగా డైనోసర్ నిజంగా వచ్చి మాట్లాడినట్లుగా చూపించడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read : Pushpa movie Sami Sami Song: ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ వెంటపడుతోన్న శ్రీవల్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook