AstraZeneca vaccine approve to next week?: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా తయారుచేసిన కోవిడ్-19 (Coronavirus Vaccine) వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు ఎమర్జెన్సీ వినియోగం కింద వచ్చే వారంలో అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని సీరం సంస్థ, తయారీ సంస్థ ప్రభుత్వానికి అందించిందని.. ఈ నేపథ్యంలో వచ్చే వారం అనుమతులు లభించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్త సంస్థ వెల్లడించింది.
అయితే కోవిడ్ వ్యాక్సిన్ల (COVID-19 Vaccine) ఎమర్జెన్సీ వినియోగం కోసం ఈ నెల ప్రారంభంలో సీరం (SII), ఫైజర్, భారత్ బయోటెక్ సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు దరఖాస్తులు చేశారు. డిసెంబరు 9న ఆయా దరఖాస్తులను పరిశీలించిన సీడీఎస్‌సీఓ (CDSCO).. ఆయా టీకాలపై మరింత సమాచారం ఇవ్వాలంటూ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి తయారీ సంస్థ, సీరం సంస్థ పూర్తి సమాచారాన్ని డ్రగ్ రెగ్యులేటరీ అధారిటికీ (DGCI) పూర్తి సమచారాన్ని అందించాయని.. వచ్చే వారంలో అనుమతులు లభించే అవకాశముందని పలువురు పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca Vaccine) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Also read: Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
CoviShield: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతులు!