COVID-19 Vaccine: భారత్‌కు కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వకూడదు, Bill Gates సంచలన వ్యాఖ్యలు

COVID-19 Vaccine Formula: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. అయితే భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2021, 04:17 PM IST
COVID-19 Vaccine: భారత్‌కు కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వకూడదు, Bill Gates సంచలన వ్యాఖ్యలు

COVID-19 Vaccine : ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. కరోనా టీకాలు ఉత్పత్తి ప్రారంభించిన భారత్ పలు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ అందించి సాయం చేసింది. ఆ సమయంలో భారత్‌లో కరోనా అదుపులోకి వచ్చింది, కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో ఇతర దేశాల నుంచి భారత్ సాయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ‘స్కై న్యూస్’ మీడియాకు ఇచ్చిన ఇంట్వ్యూ సందర్భంగా టెక్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ల(Corona Vaccine) ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవడానికి వీలుగా మేధో సంపత్తి హక్కుల చట్టాన్ని మార్చడం సాధ్యమవుతుందంటారా అనే ప్రశ్నకు బిల్ గేట్స్ కఠినమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా అలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఫార్ములాను ఇవ్వడానికి నిరాకరిస్తానని చెప్పారు. 

Also Read: Cancer Patientsకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి

బిల్ గేట్స్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశాన్ని అడగగా ఈ విధంగా స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వ్యాక్సిన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కరోనా లాంటి మహమ్మారికి సైతం పలు దేశాలు తమ సొంత వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. వ్యాక్సిన్ల భద్రత, ఎంత వరకు క్షేమదాయం అనే విషయాల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఫ్యాక్టరీ నుంచి భారతదేశానికి వ్యాక్సిన్ తరలించడం అనేది కొత్త విషయం అవుతుంది. కానీ COVID-19 వ్యాక్సిన్‌ను మా దేశ సంపదగా భావిస్తాం. టీకాలు కేవలం తమ గ్రాంట్లు, నైపుణ్యం వల్ల మాత్రమే రూపొందుతాయని’ వివరణ ఇచ్చారు. 

Also Read; 7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

ప్రతి విషయాన్ని మనం మార్చడం కుదరదు, ఎందుకంటే దానికి ప్రత్యేకమైన అనుమతులు అవసరం అవుతాయని చెప్పారు. కానీ అందుకోసం మరో దేశం చేసిన శ్రమ, ఖర్చు లాంటి విషయాలు ఉత్ఫన్నమవుతాయని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రతిదేశానికి సంబంధిత రెగ్యూలేటరీ ఉంటుందని, వారు ఎన్నో పరీక్షలు చేసిన తరువాత ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అందరూ అనుకున్నట్లుగా ఓ దేశం నుంచి మరో దేశానికి ఫార్ములా చెప్పి వ్యాక్సిన్ తయారు చేయడం అంత తేలిక కాదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో టెకీ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News