Name Changed Countries: పేరు మార్చుకున్న దేశాల జాబితా ఇదిగో

Name Changed Countries List: G20 సదస్సు నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసే సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఈ వివాదానికి కారణమైంది. కేంద్రం ఈ పని ఊరకే చేయలేదని.. దేశంలో ఇప్పటి వరకు వివిధ నగరాల పేర్లు మార్చుతూ వచ్చిన మోదీ సర్కారు తాజాగా దేశం పేరు కూడా మార్చే పనిలో పడింది అనే టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Pavan | Last Updated : Sep 7, 2023, 10:34 PM IST
Name Changed Countries: పేరు మార్చుకున్న దేశాల జాబితా ఇదిగో

Name Changed Countries List: ప్రస్తుతం దేశంలో రెండే టాపిక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. అందులో ఒకటి సనాతన ధర్మం అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి కూడా అయిన ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కాగా రెండోది ఇండియా పేరును శాశ్వతంగా భారత్ అని మార్చనున్నారా అనే అంశం ప్రస్తుతం దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. 

G20 సదస్సు నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసే సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఈ వివాదానికి కారణమైంది. కేంద్రం ఈ పని ఊరకే చేయలేదని.. దేశంలో ఇప్పటి వరకు వివిధ నగరాల పేర్లు మార్చుతూ వచ్చిన మోదీ సర్కారు తాజాగా దేశం పేరు కూడా మార్చే పనిలో పడింది అనే టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రపంచంలో పేరు మార్చుకున్న దేశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం కూడా చర్చకొస్తోంది. అలా పేరు మారిన దేశాల జాబితాను ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.

చరిత్ర పుటల్లో హోలాండ్ అని పిలుచుకున్న దేశమే ఇప్పుడున్న నెదర్లాండ్స్. 2020 లో హోలాండ్ దేశాన్ని నెదర్లాండ్స్ అని పేరు మార్చారు. పేరు మార్చడం కంటే ముందు నుంచే హోలాండ్ కి నెదర్లాండ్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ వచ్చారు. అయితే, 2020 లో హోలాండ్ ని అధికారికంగా నెదర్లాండ్స్ అని పేరు మార్చారు.

చెక్ రిపబ్లిక్ దేశం పేరుని చెకియా అని పేరు మార్చారు. చెక్ రిపబ్లిక్ అనేది చిన్న దేశం. చెక్ రిప్లబ్లిక్ కి నాలుగు వైపులా నాలుగు దేశాలు ఉన్నాయి. ఉత్తరాన పోలాండ్, దక్షిణాన ఆస్ట్రియా, పశ్చిమాన జర్మనీ, తూర్పున స్లోవేకియా దేశాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం చరిత్రలో చెక్ రిపబ్లిక్ పేరు ప్రస్తావనకు రావడం గుర్తుండే ఉంటుంది. 

ఇప్పుడు మనం పిలుచుకుంటున్న మన పొరుగు దేశమైన మయన్మార్ పేరు ఒకప్పుడు బర్మా అనే విషయం తెలిసిందే. 1989 లో బర్మాను మయన్మార్ అని పేరు మార్చడం జరిగింది. 

దక్షిణాఫ్రికాలోని స్వాజిలాండ్ అనే దేశం పేరు కూడా 2018 లో ఈశ్వటిని అని మార్చుకున్న సంగతి తెలిసిందే.

శ్రీలంక చరిత్రలో ఆ దేశానికి వేరే పేరు ఉండేది. 1972 వరకు శ్రీలంకను సీలాన్ అని పిలుచుకునే వారు. 

థాయిలాండ్ అసలు పేరు సియామ్. 1939 లో సియామ్‌‌ని థాయిలాండ్ గా పేరు మార్చారు. 

టర్కీని సైతం 2021 లో టర్కియే అని పేరు మార్చారు.

Trending News