Coronavirus: ఒక్కరోజులో దాదాపు 2.5 లక్షల కేసులు

అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి  సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.

Last Updated : Jul 16, 2020, 05:03 PM IST
Coronavirus: ఒక్కరోజులో దాదాపు 2.5 లక్షల కేసులు

అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి  సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ ( World wide corona spread ) వేగవంతమవుతోంది. రోజురోజుకూ వేలాది కేసులు ప్రతి దేశం నుంచి వెలుగు చూస్తున్నాయి. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో కలిపి 2 లక్షల 30 వేల 370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల్ని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ( World Health Organisation ) ( WHO ) వెల్లడించింది. గతంలో ఈ సంఖ్య అత్యధికంగా జూలై 10వ తేదీన 2 లక్షల 28 వేల 102గా ఉంది. కేసులు సంఖ్య నిరంతరం పెరుగుతున్నా...మరణాల సంఖ్య మాత్రం స్థిరంగా ఉండటంతో కాస్త ఊరట కలుగుతోంది. Alsor read: Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ( America ) , బ్రెజిల్ ( Brazil ) , భారత్ ( Bharat ) లు కరోనా వైరస్ కేసుల ( Corona virus cases ) విషయంలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో నిన్న ఒక్కరోజే 28 వేల కేసులు నమోదయ్యాయి. అటు బ్రెజిల్ లో 35 వేల కేసులు నమోదు కాగా...అగ్రస్థానంలో నిలిచిన అగ్రరాజ్యంలో 66 వేల 5 వందల కేసులు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి 30 లక్షలమందికి కరోనా వైరస్ సోకింది. 5 లక్షల 68 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: TikTok versus Amazon: అమెజాన్ యూ టర్న్‌కు కారణమేంటి?

ప్రతిరోజూ ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం భయం గొలుపుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలనిచ్చేట్టు కన్పించడం లేదు. వ్యాక్సిన్ ( Corona vaccine ) ఇంకా అందుబాటులో రాకపోవడంతో వివిధ రకాల మందుల్ని నిత్యం ప్రయోగిస్తూ అధ్యయనం చేస్తోంది వైద్యరంగం. Also read: Supreme court: ఆ గది తాళాలు వారివే

Trending News