Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది. కొవిడ్ మూడో వేవ్ తో పలు దేశాలు ఆగమాగం అయ్యాయి. మూడో వేవ్ ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితిలు మెరుగుపడుతున్నాయి. ఈ సమయంలోనే మరో కొత్త కొవిడ్ వేవ్ వచ్చేసింది. శర వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది.
కొవిడ్ కొత్త వేవ్ తో యూరప్ దేశాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. తాజా కొవిడ్ వైరస్ కొత్త వైరస్ గతంలో వచ్చిన వైరస్ ల కంటే కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో రోజుల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కొవిడ్ కొత్త వేవ్ ఫ్రాన్స్ లో విలయతాండవం చేస్తోంది. అక్కడ ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ విజృంభణతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్క్ ఖచ్చితంగా ధరించాలని వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ చెప్పారు హెచ్చరించారు. ప్రజా రవాణాలో మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫ్రాన్స్ లో గత నుంచి కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. వారం రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఫ్రాన్స్ లో పాటిజివిటి రేట్ ప్రమాదకరంగా ఉంది. మే 27న ఫ్రాన్స్ లో 17 వేల 705 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 52 వేలు దాటింది. ఫ్రాన్స్ పక్క దేశం పోర్చుగల్ లోనూ కొవిడ్ కల్లోలం స్పష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఒమిక్రాన్ వేరియంట్ రూపాంతరం చెంది బీఏ4 బీఏ5గా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ వల్లే తాజాగా కేసులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. కొత్త వేరియంట్లపై ఫ్రాన్స్ వైద్య నిపుణులు పరిశోధన జరుపుతున్నారు. అయితే కొత్త వేవ్ తో కొవిడ్ భారీన పడినా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం రావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగాలున్న వారికి మాత్రమే పరిస్థితి కొంత డేంజర్ గా ఉందని చెప్పారు. అటు ఇప్పటికే బ్రిటన్ లోనూ కొవిడ్ కొత్త వేరియంట్లను గుర్తించారు.. 'ఎక్స్.ఈ' అనే ఒమిక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ2 సబ్ కంటే 10శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని బ్రిటన్ పరిశోధకులు హెచ్చరించారు. అయితే ఎక్స్ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించవరకు దీన్ని ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే గుర్తిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Read also: Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.