Face Mask tips: ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెంచుతున్న కరోనా వేరియంట్. మూడు వారాల క్రితమే ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం (WHO on Omicron Variant) చేసింది. ఇప్పుడు 89 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి.
ఒమిక్రాన్ కరోనా వేరియంట్లలో ఓ కొత్త రకంగా మాత్రమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని, వ్యాక్సిన్ (Corona Vaccine) ప్రభావాన్ని కూడా తట్టుకోగలదని అమెరికాకు చెందిన ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicrona latest Update) త్వరలోనే డెల్టా వేరియంట్ కన్నా తీవ్రంగా వ్యాపించే ప్రమాదముందని అంచనాలు వస్తున్నాయి.
కొవిడ్ రూల్స్..
ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. ఓ మంచి విషయం ఏమిటంటే వ్యాక్సిన్ తీసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తల (Omicron prevention tips) ద్వారా దీని ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశముంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు మళ్లీ మాస్క్ తప్పనిసరి (Mask mandatory) నిబంధనలను అమలు చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు అందరిలోను ఒకే ప్రశ్న.. ఒమిక్రాన్ వేరియంట్‌ను మాస్క్‌లు నిజంగానే అడ్డుకోగలవా? మాస్క్‌ను ధరించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని. ఈ సందేహాలకు నిపుణులు చెబుతున్న (Mask wearing tips) సమాధానాలు ఇలా ఉన్నాయి.
వేరియంట్‌ను బట్టి మాస్క్‌ల పనితీరు ఉంటుందా?
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. మాస్క్ ధరించడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ సోకకుండా కూడ మాస్క్ రక్షణనిస్తుంది. మాస్క్‌లకు వేరియంట్‌తో సంబంధం లేదని సీడీసీ పేర్కొంది. మాస్క్‌లు సాధారణంగా వైరస్ సహా, దుమ్ము, దూళి కణాలు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగోడలా పని చేస్తాయని వివరించింది. అయితే మాస్క్‌లు ధరించినప్పటికీ కొన్ని సార్లు వైరస్లు లోనికి ప్రవేశించే అవకాశముందని మాత్రం తెలిపింది.
మాస్క్ ధరించడం ద్వారా ఒమిక్రాన్ సహా ఇతర అన్ని రకాల కరోనా వేరియంట్ల నుంచి సరైన రక్షణ పొందాలంటే.. పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది సీడీసీ.
ఎలాంటి మాస్క్‌లు వాడాలి?
రెండు లేదా అంతకన్నా ఎక్కువ లేయర్ల మాస్క్‌లు ఉత్తమం. ఆ మాస్క్‌లు శుభ్రం చేసేందుకు అనువుగా.. సులభంగా గాలిపీల్చేందుకు వీలుగా ఉండాలి.
ముఖంపై సరిగ్గా అతుక్కుని ఉండేలా మాస్క్ పెట్టుకోవాలి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా చూసుకోవాలి.
నోస్ వైర్ ఉన్న మాస్క్‌లను వాడాలి. దీని ద్వారా ముక్కుపై నుంచి గాలి లోపలకి రావడాన్ని నిరోధించొచ్చు.
ఫిల్టర్లు, కవాటాలు ఉన్న మాస్క్‌లను వాడకపోవడమే ఉత్తమం. ఇవి వైరస్‌లను లోనికి అనుమతించే అవకాశముంది.
సర్జికల్ మాస్క్‌లు, మల్టీ లేయర్ క్లాత్ మాస్కులు ఉపయోగించడం మంచిందే. ఇవి చౌకగా కూడా లభిస్తాయి.
డిస్పోజబుల మాస్క్‌పై.. ఓ క్లాత్ మాస్క్‌ను ధరించడం వల్ల అదనపు రక్షణ పొందొచ్చు.
Also read: Omicron scare: ఒక్క రోజులో 12,133 ఒమిక్రాన్ కేసులు.. ఎక్కడంటే?
Also read: Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్' బీభత్సం- 100 దాటిన మృతుల సంఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook