'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి ఉద్ధృతి తగ్గడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోనే కాలం గడుపుతున్నాయి. ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలోనూ పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపారాలు అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా కార్మికులు, ఇతర పేదవర్గాల వారు పడరానిపాట్లు పడుతున్నారు.
అన్నమో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్నారు. మనసున్న మారాజులు, స్వచ్ఛంద సంస్థలు వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ లాక్ డౌన్ నెలల తరబడి కొనసాగుతోంది. దీంతో ఎవరి వద్ద కూడా ఆర్ధికంగా వెసులుబాటు ఉండడం లేదు. దీంతే పేదల ఆకలి తీర్చేందుకు కష్టమవుతోంది. ఐతే చేయి చేయి కలిపితే పేద వారి ఆకలి తీర్చడం పెద్ద సమస్య కాదని ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫా ముందుకొచ్చింది.
ఏపీలో అలా..!! తెలంగాణలో ఇలా.. !!
బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం ఇది. దీని గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుర్జ్ ఖలీఫా గతంలోనూ వార్తల్లో నిలిచింది. భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో భవనం.. అంతా త్రివర్ణ పతాకంతో విద్యుత్ కాంతులీనుతూ కనిపించింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ .. హ్యాప్పీ న్యూ ఇయర్ అంటూ విద్యుత్ కాంతులు కనువిందు చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ విస్తృతమవుతున్న నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా మరోసారి వార్తల్లో నిలిచింది.
బుర్జ్ ఖలీఫా.. మళ్లీ తళతళా మెరిసింది. విద్యుత్ కాంతులతో విరాజిల్లింది. కరోనా వైరస్ ఉద్ధృతమైన వేళ పేదల కడుపు నింపేందుకు మరోసారి కాంతులతో తళతళలాడింది. బుర్జ్ ఖలీఫా తరఫున .. విరాళాలు సేకరించడానికి కొత్త పథకం ప్రవేశపెట్టారు. వన్ లైట్ వన్ మీల్ పేరుతో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. అంటే ఒక్కరు విరాళం ఇస్తే ఒక్క లైట్ వెలిగిస్తారన్నమాట. మొత్తంలో భవనంలో 12 లక్షల లైట్లు ఉన్నాయి. వీటన్నింటికీ అందరూ విరాళం ఇస్తే... కోట్ల మంది ఆకలి తీర్చవచ్చు. ఐతే బుర్జ్ ఖలీఫా వన్ లైట్ వన్ మీల్ ప్రారంభించిన 24 గంటల్లోనే లక్షా 76వేల మంది విరాళం ఇవ్వడం విశేషం. అతి కొద్ది కాలంలోనే మొత్తం లైట్లకు జనం నుంచి విరాళాలు అందాయి. దీంతో ఇదిగో ఈ క్రింద ఉన్న వీడియోలోలా బుర్జ్ ఖలీఫా కాంతులతో ధగధగలాడింది.
Burj Khalifa lights up to help light up the lives of the most affected by the global pandemic. Together the impossible is possible. Visit https://t.co/rMcq2trKmR to donate. #1Light1Meal #WorldsTallestDonationBox@MBRInitiatives pic.twitter.com/c1vkI0e9Hm
— Burj Khalifa (@BurjKhalifa) May 3, 2020