పాకిస్తాన్ ప్రధాన మంత్రి ( Pakistan Prime Minister ) ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) ఓ పిరికిపింద అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్లో( Bilawal Bhuttoo ) సంచనల వ్యాఖ్యాలు చేశారు. పాకిస్తాన్ నేషనల్ ఆసెంబ్లీలో బిలావల్ చేసిన కామెంట్స్ సంచనలంగా మారాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధాని బేజజీర్ భుట్టో ( Benazir Bhuttoo ) తనయుడు బిలావల్ భుట్టో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశాడు. ఇమ్రాన్ పిరికి వాడని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యాలు చేశాడు. Also Read : డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు వారెంట్ జారీ..
‘పాక్ ప్రధాని.. ఒసామా బిన్ లాడెన్ ను అమరుడిగా కీర్తించాడు. కానీ బిన్ లాడెన్ దేశ ప్రజలను, సైనికులను అంతం చేశాడు. దాంతో పాటు బేనజీర్ భుట్టో హత్యలో కూడా ఒసామాకు చెందిన అల్ ఖైదా హస్తం ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి ప్రధాని అంటే దేశంలో ఉగ్రవాదం అంతానికి ప్రయత్నిస్తూ అమరులైన బేజజీర్ భుట్టో వంటి వారిని అమరులుగా కీర్తించలేడు. కానీ ఒసామా బిన్ లాడెన్‌ను మాత్రం అమరుడని కీర్తిస్తున్నాడు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేని పిరికివాడు’ అని నిండు సభలో అవమానించాడు. బిలావల్ వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. Also Read : Pakistan Stock Exchangeపై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు సహా 10 మంది మృతి
Imran VS Bilawal : ఇమ్రాన్ పరువు తీసిన బిలావల్ .. నిండు సభలో అవమానం