Bangladesh Train Accident: ఘోర రైలు ప్రమాదంలో 20 మంది మృతి.. అనేక మందికి గాయాలు

Bangladesh Train Accident News Updates: ఇప్పటికే ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Written by - Pavan | Last Updated : Oct 23, 2023, 08:57 PM IST
Bangladesh Train Accident: ఘోర రైలు ప్రమాదంలో 20 మంది మృతి.. అనేక మందికి గాయాలు

Bangladesh Train Accident News Updates: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాకు 60 కిమీ దూరంలో కిషోర్ గంజ్ జిల్లాలో సరుకు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు, మరో ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొంది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. చత్తోగ్రామ్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢాకా వెళ్తున్న ఎగరోసిందూర్ గోధూలి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను వెనుక నుండి ఢీకొన్నట్టు తెలుస్తోంది. 

కిషోర్ గంజ్ జిల్లా భైరబ్ ప్రాంతం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను భైరబ్ రైల్వే పోలీసు స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ సిరాజుల్ ఇస్లాం మీడియాకు వెల్లడించారు.

ఇప్పటికే ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

సహాయక చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతాయని.. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో సహాయ చర్యల్లో వేగం పెంచి, రైళ్ల రాకపోకలకు మార్గం సుగుమం చేసేందుకు భారీ క్రేన్ తో మరో రైలు ఘటనా స్థలానికి బయల్దేరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి : Nestle Company: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎఫెక్ట్.. ఈ దేశంలో నెస్లే కంపెనీ క్లోజ్

బంగ్లాదేశ్‌కి చెందిన బిడిన్యూస్ 24 పోర్టల్ వార్తా కథనం ప్రకారం.. ఢాకా రైల్వే పోలీసు సూపరింటెండెంట్ అన్వర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ , " ప్రాథమిక దర్యాప్తులో తేలిన వివరాలను పరిశీలిస్తే, ఎగరోసిందూర్ గోధూలి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొన్నట్టు తెలుస్తోంది " అని పేర్కొన్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Iran Warning: దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News