Libyan Boat Accident: సముద్రంలో వలసదారుల పడవ బోల్తా.. 60 మందికిపైగా మృతి..

World news: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన లిబియా తీరంలో జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 04:02 PM IST
Libyan Boat Accident: సముద్రంలో వలసదారుల పడవ బోల్తా.. 60 మందికిపైగా మృతి..

Libyan Boat Accident: ఉత్తర ఆఫ్రికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడటంతో 60 మందికిపైగా మరణించినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడి కారణంగా పడవ మునిగిపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు పేర్కొంది. నైజీరియా, గాంబియా మరియు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన సుమారు 86 మంది వలసదారులు పడవలో ఉన్నట్లు ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు. 25 మందిని రక్షించిన అధికారులు వారిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది. ప్రాణాలతో బయటపడిన వారందరూ ఆరోగ్యంగా ఉన్నారనే పేర్కొంది. 

ఐరోపా దేశాలకు వలస వెళ్లాలనుకునే ఆఫ్రికా వాసులకు లిబియా, ట్యూనీసియా ప్రధాన రవాణా కేంద్రాలుగా మారుతున్నాయి. వలస దారులు ప్రాణాలు రిస్క్ చేసి పడవల్లో ఇటలీకి చేరి అక్కడ నుంచి ఐరోపాకు చేరుకుంటున్నారు.  ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం, ట్యునీషియా మరియు లిబియా నుండి ఈ సంవత్సరం 153,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అక్రమ వలసలను అరికడతామని చెప్పే గత ఎన్నికల్లో విజయం సాధించారు ఇటలీ ప్రధాని జార్జియో మెలోని. మధ్యధరా సముద్రంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. 

Also Read: Iran Visa Free Travel: ఇక నుంచి ఇరాన్‌లోకి ఫ్రీ ఎంట్రీ.. భారతీయులకు గుడ్‌న్యూస్

ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2,250 మంది మరణించినట్లు ఐఓఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పేదరికం నేపథ్యంలో మెరుగైన జీవితం కోసం ప్రతి ఏటా వేలాది మంది ఆఫ్రికన్ ప్రజలు ఐరోపాకు వలసపోతున్నారు. దీనిని అదునుగా చేసుకుని మానవ అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. వీరి కక్కుర్తికి తాజా ఘటనలే నిదర్శనం.

Also Read: World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యంగా నిలిచిన 2023

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News