Amrullah Saleh: పంజ్‌షేర్ వ్యాలీపై తాలిబన్ల దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. పంజ్‌షేర్(Panjshir)లో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతోందని.. తాలిబన్లు(Taliban) ఈ ప్రాంతానికి మానవవనరులు, నిత్యావసరాలను నిలిపివేశారని.. ప్రస్తుతం దాడులకు తెగబడ్డారని, వారి అరాచకాలను అరికట్టాలని ఐక్యరాజ్య సమితి(UNO)తోపాటు అంతర్జాతీయ నేతలను ఆయన కోరారు. సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణసాయం అందించాలని వేడుకున్నారు.
మానవ సంక్షోభం ఏర్పడింది..
పంజ్‌షేర్(Panjshir Province) ప్రావిన్స్‌తోపాటు, బగ్లాన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాల్లో ఆర్థిక వనరులు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల నిలిపివేతతో ఇక్కడ మహా మానవ సంక్షోభం ఏర్పడిందని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు ఐరాసకు లేఖ రాశారు. ‘పంజ్‌షేర్ ప్రావిన్స్‌పై తాలిబన్ల దాడిని నివారించాలని ఐక్యరాజ్యసమితితోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నా. వేలాది మంది నిర్వాసితులు, స్థానిక పౌరులను రక్షించేందుకు రాజకీయ పరిష్కారం చూపించాలి’ అని కోరారు. తాలిబన్లతోపాటు విదేశీ దుష్ట శక్తులు పంజ్‌షేర్‌పై దాడి చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం, ఆధిపత్య
ఆకలి కేకలు
మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా పంజ్‌షేర్‌లో 2.5లక్షల మంది నివాసం ఉంటున్నారని, కాబుల్(Kabul) ఆక్రమణలతో మరో 10వేలమంది ఇక్కడకు చేరుకున్నట్లు అమ్రుల్లా వివరించారు. ‘తాలిబన్లపై భయంతో ఈ ప్రాంతానికి చేరుకున్నవారంతా మసీదులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతోపాటు మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో ఆకలితో అలమటిస్తున్నారు. పంజ్‌షేర్‌తోపాటు వ్యాలీలోని మరికొన్ని ప్రాంతాలు కూడా సంక్షోభంతో ఇక్కట్లు పడుతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టి సారించకపోతే మానవహక్కులు అడుగంటిపోతాయి. తిండి కోసం సామూహిక హత్యలు, మారణహోమం జరిగే అవకాశం ఉంది’ అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే సాయం చేయండి..
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణసాయం అందించాలని అమ్రుల్లా సలేహ్(Amrullah Saleh) కోరారు. ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అత్యవసరమని ఐరాసకు తెలియజేశారు. తన ఈ విన్నపంపై ఐరాస, ఐక్యరాజ్య సమితి, రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌జీఓలు సహా స్వచ్ఛంద సంస్థలు స్పందించి తగు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షేర్‌ను వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతానికి అన్ని సదుపాయాలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడకు చేరుకొని దాడులు ప్రారంభించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook