Joe Biden Major Decisions: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బిడెన్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జో బిడెన్ సంతకాలు చేసిన ఆ పదిహేడు కార్యనిర్వాహక ఆదేశాలేంటి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America presiden elections ) భారీ విజయం సాధించిన జో బిడెన్ ( Joe Biden ) జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా జో బిడెన్ తొలిరోజే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 17 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) హయాంలో తీసుకొచ్చిన పలు ఆదేశాల్ని జో బిడెన్ వెనక్కి తీసుకున్నారు. ప్రజల ప్రయోజనార్ధం ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పు, జాతి వివక్ష నిర్మూలన, కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ విధానాలపై ట్రంప్ తెచ్చిన పాలసీల్ని వెనక్కి తీసుకున్నారు.
జో బిడెన్ సంతకాలు చేసిన కీలక నిర్ణయాలివే
పారిస్ వాతావరణ ఒప్పందం ( Parris Agreement ) లో అమెరికాను మళ్లీ భాగస్వామ్యం చేసే నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధుల రుణ విరామం గడువు పొడిగించారు. ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. దేశంలో వంద రోజుల పాటు మాస్క్ ధారణను తప్పనిసరి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా మళ్లీ కలిసి ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో సరిహద్దు గోడ ( Mexico Border Wall ) నిర్మాణాన్ని నిలిపివేశారు. కరోనా వైరస్ ( Corona virus ) పై జాతీయ ప్రతిస్పందనను సమన్వయం చేసేందుకు కొత్త ఫెడరల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అమెరికాలో జాతి వివక్ష నిర్మూలన లక్ష్యంగా పలు వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు వచ్చి స్థిరపడిన లక్షలాదిమంది ప్రజలకు మేలు చేకూరేలా శాశ్వత నివాసం, పౌరసత్వం కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రీన్‌కార్డుల ( Green card ) జారీ విషయంలో దేశాల ప్రకారం ఉన్న పరిమితిని ఉపసంహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook