Jeo Biden Gifts Special T - Shirt To PM Modi: భారత్ - అమెరికా దేశాల సాంకేతిక సహకారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం అమెరికార పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి బైడెన్ ప్రత్యేక టీ-షర్టును బహుమతిగా ఇచ్చారు. దీనిపై "భవిష్యత్తు AI-అమెరికా-ఇండియా" అని కోట్ ఉంది. యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రెండుసార్లు చేయడం ప్రసంగించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. తాను ఏడేళ్ల క్రితం ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందన్నారు. భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. గత కొన్నేళ్లుగా AI-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అనేక పురోగతులు వచ్చాయని తెలిపారు.
అమెరికా-భారత్‌లో మరింత అభివృద్ధి జరిగిందని.. రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. "యూఎస్ పురాతనమైనది-భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం.. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మంచి సూచన.. ఇప్పుడు మన యుగం కూడలిలో ఉన్నప్పుడు.. ఈ శతాబ్దానికి మన పిలుపు గురించి మాట్లాడటానికి నేను ఇక్కడకు వచ్చాను" అని మోదీ అన్నారు. ఆలోచనలు, భావజాలానికి సంబంధించిన చర్చను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య సత్సంబంధాల కోసం కలిసి రావడం చూసి తాను సంతోషిస్తున్నాని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అధ్యక్షుడు బిడెన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాపిల్ సీఈవో టిమ్ కుక్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా జో బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. మోదీకి పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతోపాటు ఓల్డ్ అమెరికన్ కెమెరాను బైడెన్ బహుకరించారు. జో బైడెన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన పెట్టెను మోదీ కానుకగా ఇచ్చారు.
Also Read: Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి