Afghanistan Floods: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 26 మంది మృతి.. 40 మంది గల్లంతు

Heavy Rainfall in Afghanistan: భారీ వరదలు ఆఫ్ఘనిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్‌లో 26 మంది మృతిచెందారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 23, 2023, 09:23 PM IST
Afghanistan Floods: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 26 మంది మృతి.. 40 మంది గల్లంతు

Heavy Rainfall in Afghanistan: భారీ వరదలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. మన దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వరదలకు తోడు.. కొండ చరియాలు విరిగిపడడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో ఆ దేశంలో భారీ వరదల సంభవించాయి. సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటివరకు 26 మంది మరణించగా.. 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. 

శుక్రవారం నుంచి వరదల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఆస్తి, వ్యవసాయ భూములకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫివుల్లా రహీమి చెప్పారు. మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లోని జల్రెజ్ జిల్లాలోని విపత్తు జోన్‌కు అత్యవసర సహాయాన్ని తరలించినట్లు చెప్పారు. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో రక్షణ కోసం బృందాలు నిమగ్నమై ఉన్నాయన్నారు. కుండపోత వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వెల్లడించారు. 

భారీ వర్షాల కారణంగా కాబూల్‌కు పశ్చిమంగా ఉన్న మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లోని జల్రెజ్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయని ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. దాదాపు 40 మంది అదృశ్యమయ్యారని చెప్పారు. వరద ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

వరదల కారణంగా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రావిన్షియల్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శిథిలాల కింద వ్యక్తులు ఉన్నట్లు భావిస్తున్నామని.. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. వరదల కారణంగా వందలాది హెక్టార్లలో రైతుల పంటలు నాశనమయ్యాయని తెలిపింది. కాబూల్-సెంట్రల్ బమియాన్ ప్రావిన్స్ మధ్య హైవే కూడా మూసివేవేశారు.

Also Read: PM Kisan Latest Updates: అన్నదాతలకు ముఖ్య గమనిక.. ఆ రోజే అకౌంట్‌లోకి డబ్బులు జమ  

Also Read: Rapido Driver: ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. యువతి బైక్ ఎక్కగానే డ్రైవింగ్ చేస్తూ హస్తప్రయోగం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News