యూట్యూబ్‌ హెడ్‌క్వార్టర్స్ వద్ద కాల్పులు

మంగళవారం కాలిఫోర్నియాలోని సాన్ బ్రూనోలో గల యూట్యుబ్ యొక్క ప్రధాన కార్యాలయం వద్ద వద్ద  ఓ మహిళ కాల్పులకు పాల్పడింది.

Last Updated : Apr 5, 2018, 08:51 AM IST
యూట్యూబ్‌ హెడ్‌క్వార్టర్స్ వద్ద కాల్పులు

వాషింగ్టన్:  మంగళవారం కాలిఫోర్నియాలోని సాన్ బ్రూనోలో గల యూట్యుబ్ ప్రధాన కార్యాలయం వద్ద  ఓ మహిళ కాల్పులకు పాల్పడింది.  ఈ క్రాస్-ఫైరింగ్ సంఘటనలో ఒక మహిళా గన్‌మెన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారు.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాల్పులకు పాల్పడిన మహిళే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం, సౌత్ ఫ్రాన్సిస్కో పోలీసులు ట్విట్టర్ ద్వారా యూట్యూబ్ కార్యాలయం నుండి ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. "మేము షూటర్ చర్యలను సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాం.  చెర్రీ అవే  & బే హిల్ డ్రైవ్ నుండి దూరంగా ఉండండి", అని దక్షిణ ఫ్రాన్సిస్కో పోలీస్ ట్వీట్ చేశారు.

'కాల్పుల శబ్దం విన్నాక కార్యాలయంలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం 10రౌండ్లు తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో మొత్తం 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.' అని ఓ యూట్యుబ్ అధికారి తెలిపారు. క్షతగాత్రులను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.  సకాలంలో స్పందించిన లా అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Trending News