అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020పై ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే పలు ఇతర దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 (US Election 2020)లో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు పోలింగ్‌లో భారీ శాతం ఓటింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 62 మిలియన్లు (6.2 కోట్లు) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016తో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న ముందస్తు పోలింగ్ చాలా అధికమని అధికారులు చెబుతున్నారు.
గత అధ్యక్ష ఎన్నికలతో పోల్చితే దాదాపు 15 మిలియన్ల ఓట్లు అధికంగా పోలింగ్ నమోదైందని ఫ్లోరియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ మెక్ డొనాల్డ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ భారీ శాతం నమోదు కానుందని ఎన్నికల విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. అమెరికా ఓటర్లు చైతన్యం పొంది ఈ విధంగా భారీ సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొనడంపై ప్రొఫెసర్ హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో 150 మిలియన్ల మంది (15 కోట్లు) ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన అంచనా వేశారు. దాదాపు 65శాతం పోలింగ్ నమోదు కానుందని, 1908 తర్వాత ఇదే అత్యధిక శాతం ఓటింగ్ కానుందని పేర్కొన్నారు. టెక్సాస్ ఓట్లు కీలకం కానున్నాయి. 2016లో నమోదైన మొత్తం ఓట్లలో ఇప్పటికే 82శాతం పోలింగ్ జరిగింది. 7.4 మిలియన్ల టెక్సాస్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Also Read : RR vs MI Match Hardik Pandya: ఐపీఎల్లో తొలి ఆటగాడు హార్దిక్ పాండ్యా.. శభాష్ అంటూ ప్రశంసలు
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికల బరిలో ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి పోటీ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల చరిత్రలో అత్యధికంగా నగదు ప్రకటనలకు ఖర్చు చేసిన అభ్యర్థిగా జో బిడెన్ నిలిచారు. ఆయన ప్రకటనల ఖర్చు మరింతగా పెరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe