Monkeypox: మంకీపాక్స్ బారిన పడ్డ ఓ వ్యక్తి నుంచి శాస్త్రవేత్తలు అనేక అంశాలను గుర్తించారు. బాధితుడికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు గుర్తించారు. ఒకేసారి మూడు వైరస్‌ల బారిపడ్డ తొలి కేసు ఇదేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇటీవల ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన తొమ్మిది రోజుల తర్వాత జ్వరం, అలసట, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
స్పెయిన్‌లో జూన్ 16 నుంచి 20 వరకు ఐదురోజులపాటు అతడు ఓ యువకుడితో సెఫ్టీలేని శృంగారంలో పొల్గొనట్లు వెల్లడించారు. స్పెయిన్ నుంచి వచ్చిన కొన్నిరోజులకే కరోనా లక్షణాలు బయట పడ్డాయి. జులై 2న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈవిషయాన్ని జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలిపింది. కరోనా పాజిటివ్ వచ్చిన అదే రోజు అతడి ఎడమ చేతిపై దద్దర్లు వచ్చాయి. ఆ తర్వాతి రోజు మొండెం, తొడలు, ముఖం, వెనుక భాగంలో గడ్డలు ఏర్పడ్డాయి.
జులై 5 నాటికి శరీర మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఇటలీకి చెందిన వ్యక్తి కాటానియాలోని శాన్ మార్కో యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఇన్ఫెక్టియస్ డిసీజెస్ విభాగానికి తీసుకెళ్లారు. వర్సిటీలో చేరిన పరీక్షల్లో మంకీపాక్స్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాధితుడికి ఎస్‌టీఐ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. సీడీ4 స్థాయిలను బట్టి సాపేక్షంగా హెచ్‌ఐవీ సంక్రమించినట్లు తాము భావిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.
గతేడాది సెప్టెంబర్‌లో బాధితుడికి నిర్వహించిన హెచ్‌ఐవీ పరీక్షల్లో నెగిటివ్ తెలిపింది. చికిత్స అనంతరం కరోనా, మంకీపాక్స్ నుంచి అతడు కోలుకున్నాడు. జులై 11న బాధితుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం హోం ఐసోలేషన్ తరలించారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అతడి చర్మంపై మచ్చలు కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మంకీపాక్స్, కరోనా లక్షణాలు ఒకేసారి ఎలా వ్యాప్తి చెందుతాయో ఈ కేసు బట్టి తెలుస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాటానియా స్పష్టం చేసింది.
కో-ఇన్ఫెక్షన్, అనామ్నెస్టిక్ సేకరణ, లైంగిక అలవాట్లు సరైన రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగపడతాయని తెలిపింది. బాధితుడికి వైరస్ సోకి 20 రోజులైనా మంకీపాక్స్ ఓరోఫారింజియల్ స్వాబ్ పాజిటివ్‌గా ఉందని వారు వెల్లడించారు. ఓ వ్యక్తికి మూడు వైరస్‌లు సోకితే అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందన్న దానికి తగినంత ఆధారాలు లేవని యూనివర్సిటీ ఆఫ్ కాటానియా తేల్చి చెప్పింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 32 వేలకు పైగా నమోదు అయ్యాయి.
Also read:Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా..రాకెట్ దాడిలో 22 మంది మృతి..!
Also read:Kuppam Babu Tour Live Updates: కుప్పంలో టెన్షన్..టెన్షన్..ఇక్కడి నుంచే ధర్మపోరాటమన్న చంద్రబాబు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి