World's second-largest diamond Price : ఇప్పటి వరకు రాత్రికి రాత్రి ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా మారిన సంఘటనలు ఎన్నో చూశాం. కానీ 24గంటల్లో ఒక దేశంలో ధనవంతమైన దేశంగా మార్చింది. పేదరికం, ఆకలి చావులతో కొట్టామిట్టాడుతున్న ఆఫ్రికన్ దేశ భవిష్యత్తును 24గంటల్లోనే ఒక్కసారిగా మారిపోయింది. పేద దేశం కాస్త సంపన్న దేశంగా ఎదిగింది.
అసలు విషయం ఏంటంటే?
బోట్స్ వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ వజ్రం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రమని లుకారా డైమెండ్ కార్పొరేషన్ ఓ ప్రకటనల తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటేక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు వెల్లడించింది. 1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ఇప్పటి వరకు ప్రపంచలోనే అతిపెద్దది. అయితే తాజాగా లభ్యం అయిన ఈ వజ్రం..రెండో అతిపెద్దదిగా నిలిచినట్లు తెలిపింది. అయితే ఈ వజ్రం విలువు, నాణ్యత విషయాలను మాత్రం సదరు సంస్థ వెల్లడించలేదు. ఈ అసాధారణమైన 2,492 క్యారెట్ల వజ్రాన్ని కనగొనడం చాలా సంతోషంగా ఉందని లుకారా కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు. ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్ వానా కూడా ఒకటి.
Also Read : Tech Mahindra Deal: తగ్గేదేలేదంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. వందల కోట్లు పలుకుతున్న టెక్ మహీంద్ర డీల్
కాగా ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ అయిన కల్లినన్ 3,106 క్యారెట్లు ఉండగా దాన్ని అనేక ముక్కలుగా కట్ చేశారు. వాటిలో కొన్ని బ్రిటిష్ రాయల్ జ్యువెల్లరీలో ఉన్నాయి. 1800ల చివరిలో బ్రెజిల్ లో ఒక పెద్ద నల వజ్రాన్ని గుర్తించారు. అయితే అది భూమి ఉపరితలంపై కనుగొన్నారు. అది ఉల్కలోని భాగమని నిపుణులు చెప్పారు. కాగా బోట్వ్సవాన వజ్రాల ఉత్పత్తిలో రెండవస్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోని అన్ని అతిపెద్ద వజ్రాలు ఇక్కడే గుర్తించారు.
2019లో ఈ గనిలో తవ్వితీసిన 1,758 క్యారెట్ల వజ్రాన్ని అప్పట్లో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ లూయి విటన్ భారీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. అలాగే 2016లో 1,109 క్యారెట్ల వజ్రాన్ని లండన్ కు చెందిన ఆభరణాల సంస్థల 5.3కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వజ్రాన్ని లుకారా సంస్థ మెగా డైమండ్ రికవరీ ఎక్స్ రే టెక్నాలజీ సాయంతో గుర్తించినట్లు సంస్థ తెలిపింది. 2017 నుంచి ఈ టెక్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల వజ్రాలను గుర్తించడంతోపాటు వాటిని విరిగిపోకుండా భయటకు తీసేందుకు ఛాన్స్ ఉంటుందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి