2018 నోబెల్ బహుమతి విజేతలు వీరే!

2018 నోబెల్ బహుమతి విజేతలు వీరే!

Last Updated : Oct 9, 2018, 08:02 AM IST
2018 నోబెల్ బహుమతి విజేతలు వీరే!

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2018 ఏడాదిగానూ ఇద్దరిని వరించింది. ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికైనట్లు సోమవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. విలియమ్ డీ నోర్డాస్, పౌల్ ఎం రోమర్‌లకు ఈ ఏడాది సంయుక్తంగా నోబెల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. వాతావరణ మార్పు, సాంకేతిక ఆవిష్కరణలను స్థూల ఆర్థిక విశ్లేషణకు అనుసంధానించడంలో వారు చేసిన కృషికిగాను వారికి నోబెల్‌ పురస్కారం లభించిందని నోబెల్ పురస్కార న్యాయ నిర్ణేతల మండలి ప్రకటించింది .

ఆర్థికశాస్త్రవేత్త విలియమ్ నోర్డాస్ దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలో వాతావరణ విధానాలను విశ్లేషిస్తున్నారు. దీని ఆధారంగానే కార్బన్ ట్యాక్స్‌లను విధించే ఓ స్కీమ్‌ను డెవలప్ చేశారు.

మరో ఆర్థికశాస్త్రవేత్త పౌల్ ఎం రోమర్‌ దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలో సాంకేతిక ఆవిష్కరణలతో.. సుదీర్ఘకాల ఆర్థిక ప్రగతి ఎలా సాధ్యమవుతుందన్న సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు.

ఈ ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు.

వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్‌ బహుమతి ప్రదానం చేస్తారు. నోబెల్‌ బహుమతి ప్రదానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ (నోబెల్ బహుమతి స్థాపకుడు) వర్ధంతినాడు అనగా డిసెంబరు 10వ తేదీన జరుపబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతి ఇవ్వడం లేదని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.

అటు ఏటా మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ బహుమతిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.  వైద్య శాస్త్రంలో అక్టోబరు 1న, భౌతిక శాస్త్రంలో అక్టోబరు 2న, రసాయన శాస్త్రంలో అక్టోబరు 3న, అక్టోబరు 5 నోబెల్‌ శాంతి బహుమతి పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే..!

2018 నోబెల్ విజేతలు వీరే..!

క్ర.సంఖ్య  నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు  2018 నోబెల్ విజేతలు
1. వైద్య శాస్త్రం జేమ్స్.పి.అలిసన్ (అమెరికా),  టసూకు హోంజో (జపాన్‌)
2. భౌతిక శాస్త్రం అర్థర్ అస్కిన్ (అమెరికా), జెరాడ్ మౌరౌ (ఫ్రాన్స్), డొన్నా స్ట్రిక్ లాండ్  (కెనడా)
3. రసాయన శాస్త్రం ఫ్రాన్సిస్‌ ఆర్నాల్డ్‌(అమెరికా), జార్జ్‌ స్మిత్‌(అమెరికా), గ్రెగరీ వింటర్‌(బ్రిటన్‌)
4. సాహిత్యం ఈ ఏడాది సాహిత్య రంగంతో నోబెల్ అవార్డును ప్రకటించలేదు.
5. శాంతి డెనిస్‌ ముక్వేజ్‌ (డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో), నదియా మురాద్‌ (ఇరాన్‌)
6. ఆర్థిక శాస్త్రం విలియమ్ డీ నోర్డాస్ (అమెరికా)‌, పౌల్ ఎం రోమర్‌(అమెరికా)

 

Trending News