భారత్-చైనా సరిహద్దు ప్రాంతం డొక్లాంలో చైనా సైనికులు 1800 మంది చేరుకున్నారు. ఇప్పటికే రెండు హెలిపాడ్ లను నిర్మించుకున్న వారు.. రోడ్డు విస్తరణ పనులు కూడా మొదలుపెట్టారు. అక్కడే గుడారాలు వేసుకొని కూర్చున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఏమి జరుగుతుందో అని అందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు.
ఇదే ఏడాది మొదట్లో చైనా రోడ్డు పనుల విస్తరణ మొదలుపెడితే.. తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరుదేశాల సైన్యం భారీ ఆయుధాలను తరలిస్తూ .. ఇక యుద్ధం తప్పదన్నట్లుగా అక్కడ వాతావరణాన్ని గంభీరంగా మార్చేశారు. డొక్లాం తమదని చైనా.. కాదని భారత్ వాదిస్తున్న సంగతి తెలిసిందే..! తరువాత భారత్-చైనా ఇరుదేశాలు పరిస్థితి యధాస్థితికి రావడానికి నిర్ణయించుకొని వెనక్కు వెళ్లారు. మళ్లీ ఇప్పుడు చైనా మరోసారి తన ప్రయత్నాలను మొదలుపెట్టింది.