ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం : మంత్రి తలసాని

  • Zee Media Bureau
  • Jun 22, 2022, 05:25 PM IST

ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మావారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు

Video ThumbnailPlay icon

Trending News