Kadem Project: కడెం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

Kadem Project: ఎగువన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. నిర్మల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 04:56 PM IST

Kadem Project: ఎగువన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. నిర్మల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ ఫ్లో 3 లక్షలుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 18 గేట్లకు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక గేటు మొరాయించడంతో.. దానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కడెం ప్రాజెక్టుకు వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో.. ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Video ThumbnailPlay icon

Trending News