Sharmila Comments: ఈదరిద్రాన్ని మనమే మోయలేం..దేశానికి కావాలా..షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

Sharmila Comments: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల నిప్పులు చెరిగారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 2, 2022, 03:03 PM IST
  • సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన షర్మిల
  • మరోమారు ఘాటు వ్యాఖ్యలు
  • మా పార్టీతోనే అభివృద్ధి అని స్పష్టీకరణ
Sharmila Comments: ఈదరిద్రాన్ని మనమే మోయలేం..దేశానికి కావాలా..షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

Sharmila Comments: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో బందిగా ఉందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరి ఉంటే అందరూ సంతోషంగా ఉండే వాళ్లని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మాట్లాడిన ఆమె..సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. 

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణిచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు సైతం పనోళ్లుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపే మార్కెట్‌లో పెట్టి పశువులను కొన్నట్లు తీసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని వాగ్ధానాలు గుర్తు చేసుకున్నారో గుర్తు చేసుకోవాలని చెప్పారు. 

ఇప్పటికైనా ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌టీపీ డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్ షర్మిల. ఈ దరిద్రాన్ని మనమే మోయలేక పోతున్నాం..ఇక దేశానికి కావాలా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి రాగానే రాజన్న రాజ్యం తీసుకొస్తామన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని..వైఎస్‌ఆర్‌ హయాంలో ఎలాంటి పథకాలు అమలు అయ్యాయో..అలాంటివే తీసుకొస్తామని స్పష్టం చేశారు. 

Also read:Divyavani Comments: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు..దివ్య వాణి సంచలన వ్యాఖ్యలు..!

Also read:వరుడు లేకుండా వివాహం చేసుకుంటున్న 24 ఏళ్ల యువతి.. గోవాలో హనీమూన్ ప్లాన్! చరిత్రలో ఇదే మొదటిసారి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News