Ys Sharmila Padayatra: తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర త్వరలో, రూట్‌మ్యాప్ ఇలా

Ys Sharmila Padayatra: తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం నడుస్తోంది. కాంగ్రస్, బీజేపీలకు తోడు వైఎస్సార్‌టీపీ పాదయాత్ర చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 10:41 AM IST
  • ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేయనున్న వైఎస్ షర్మిల
  • తండ్రి ప్రారంభించిన చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న షర్మిల
  • ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలతో పాదయాత్ర రూట్‌మ్యాప్
Ys Sharmila Padayatra: తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర త్వరలో, రూట్‌మ్యాప్ ఇలా

Ys Sharmila Padayatra: తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం నడుస్తోంది. కాంగ్రస్, బీజేపీలకు తోడు వైఎస్సార్‌టీపీ పాదయాత్ర చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో కొత్తగా వైఎస్సార్‌టీపీ(YSRTP)పేరుతో పార్టీ స్థాపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. దీక్షలతో, పదునైన విమర్శలతో అధికార టీఆర్ఎస్‌ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ జగన్ ఏపీలో సాగించిన ప్రజా ప్రస్థానం పేరునే వైఎస్ షర్మిల తన పాదయాత్రకు ఖరారు చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలు తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)ఇప్పటికే తొలి విడత పాదయాత్ర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 

తెలంగాణలో(Telangana) చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్ షర్మిల(Ys Sharmila) గతంలోనే స్పష్టత ఇచ్చినా..ఇప్పుడు పాదయాత్ర పేరును కూడా ఖరారు చేశారు. త్వరలో పాదయాత్ర రూట్‌మ్యాప్ విడుదల చేయనున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant kishor)సూచనల మేరకు పాదయాత్ర వ్యూహం ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే వైఎస్ జగన్ ఓదార్పుయాత్రను( Ys jagan Vodarpu yatra)చేపట్టారు. వైఎస్ జగన్ అరెస్టుతో బ్రేక్ పడిన ఓదార్పుయాత్రను చెల్లెలు వైఎస్ షర్మిల కొనసాగించారు. అనంతరం ఏపీలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని తెలంగాణతో ప్రారంభించాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించారు. వైఎస్ షర్మిల చేపట్టనున్న ప్రజా ప్రస్థానం ఏడాదిపాటు జరగనుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్ల నుంచే వైఎస్ షర్మిల పాదయాత్ర( Ys Sharmila padayatra)ప్రారంభం కానుంది. చేవెళ్ల నుంచి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు, ముఖ్య ప్రాంతాల్ని చుట్టేలా పాదయాత్ర ఉండనుంది. ఇప్పటికే రాజన్న రాజ్యం పేరుతో వైఎస్ షర్మిల పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ..వివిధ రకాల ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నిరుద్యోగ దీక్షలతో పోరాటాన్ని విస్తరించారు. బీసీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కోడంగల్ నియోజకవర్గంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. 

Also read: Pawan Kalyan Controversy: వివాదం రేపుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం : మంత్రి కన్నబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News