YS Sharmila on CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గౌతమ్ అదానీపై చర్యలకు చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలని చెప్పడం ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్లారని నిలదీశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు..? అని ప్రశ్నించారు. అదానీ పవర్ ఎక్కువ రేటుకు కొనడంతో ప్రజలపై అధిక భారం పడిందని ఎందుకు చెప్పారని అడిగారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అధికారంలోకి రాగానే అదే అదానీ మిత్రుడు అయ్యాడని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని.. మాజీ సీఎం రూ.1700 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI రిపోర్ట్‌లో వెల్లడించిందని.. అన్ని ఆధారాలు ఉన్నా చంద్రబాబు కచ్చితమైన సమాచారం కావాలని అడగటం ప్రజలను మోసం చేస్తున్నట్లేనని అన్నారు. అధికారంలో ఉండి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని.. అదానీపై చర్యలకు భయపడుతున్నారనేది నిజమన్నారు.
మోడీ డైరెక్షన్‌లో విషయాన్ని పక్కదారి పట్టించారని.. అదానీతో రహస్య అజెండా లేకపోతే విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకుంటే.. కనీసం ఏసీబీని ఎందుకు రంగంలోకి దింపడం లేదని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయలు భారం పడే అగ్రిమెంట్లను ఎందుకు రద్దు చేయకూడదని నిలదీశారు. ఏసీబీని రంగంలోకి దింపి.. నిజనిజాలు నిగ్గుతేల్చాలని చంద్రబాబును కోరారు.
Also Read: Ram Gopal Varma: చెక్ బౌన్స్ కేసు.. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్‌గా మారిన పోస్ట్..
Also Read: BRS Party BJP: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం.. కలిసిపోయిన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter