Hyderabad: 14ఏళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి-ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్

Woman sexually assaults Nephew: హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ తన మేనల్లుడిపై లైంగిక దాడికి పాల్పడింది. 14 ఏళ్ల ఆ బాలుడిని లాడ్జికి తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చుకుంది. ఆ సమయంలో చిత్రీకరించిన వీడియోలతో అతన్ని బ్లాక్‌మెయిల్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 11:56 AM IST
  • హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం
  • 14 ఏళ్ల బాలుడిపై లాడ్జిలో లైంగిక దాడికి పాల్పడిన మేనత్త
  • ఆ వీడియోలతో బాలుడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజిన నిందితురాలు
 Hyderabad: 14ఏళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి-ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్

Woman sexually assaults Nephew: హైదరాబాద్‌లో ఓ మహిళ తన 14 ఏళ్ల మేనల్లుడిపై లైంగిక దాడికి (Sexual assault) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొద్దిరోజులుగా బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటున్న అతని మేనత్త... ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని అతనిపై బెదిరింపులకు పాల్పడుతోంది. మేనత్త బెదిరింపులకు భయపడిపోయిన ఆ బాలుడు ఇంట్లో నుంచి పలు బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలించి ఆమెకు ఇచ్చాడు. ఇటీవల ఈ విషయం బాధిత బాలుడి తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని (Hyderabad) టోలీచౌకి ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం కొద్ది నెలల క్రితం జూబ్లీహిల్స్ (Jubileehills) రోడ్ నం.10లోని గాయత్రిహిల్స్‌కు మారింది. ఇటీవల ఓరోజు ఆ ఇంటి మహిళ అలమారాలో ఏదో సర్దుతుండగా... అందులో ఉండాల్సిన నగలు లేకపోవడాన్ని గమనించింది. ఇంట్లో అన్ని గదుల్లో ఆమె నగల కోసం వెతుకుతుండగా ఆమె కొడుకు (14) ఆరా తీశాడు. 

కనిపించకుండా పోయిన ఆ నెక్లెస్‌ను తానే తీశానని... దాన్ని మేనత్తకు ఇచ్చానని చెప్పాడు. ఎందుకిచ్చావని తల్లి అడగ్గా... షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. బెంగళూరులో ఉండే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్ ఇర్ఫాన్‌తో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేదని.. ఆ సమయంలో తనను కూడా వారు ఉండే లాడ్జికి తీసుకెళ్లేవారని చెప్పాడు. అక్కడ మేనత్త తనతో శారీరక వాంఛలు (Sexual Affair) తీర్చుకునేదని... ఆ తతంగమంతా ఇర్ఫాన్ వీడియో తీసేవాడని తెలిపాడు.

Also Read: AdaviThalliMaata:'సెప్తున్న నీ మంచి సెడ్డ..అంతోటి పంతాలు పోవాకు బిడ్డ' బీమ్లా నాయక్

ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని తల్లితో చెప్పాడు. ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకురాకపోతే ఆ వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారన్నాడు. అందుకే ఇంట్లోని అల్మారా నుంచి 20 తులాల బంగారంతో పాటు రూ.6లక్షలు దొంగిలించి మేనత్తకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కొడుకు చెప్పింది విని షాక్ తిన్న ఆ తల్లి.. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఆ మహిళపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 384, పోక్సో చట్టం (Pocso Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News