Wine Shops: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్‌న్యూస్ వినిపించారు. కొన్ని గంటలపాటు మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక రోజు పాటు మద్యం లభించదు. ఎందుకంటే హోలీ పండుగ కారణంగా వాటిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు మూసివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కల్లు దుకాణాలు కూడా మూతపడనున్నాయి.
Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్.. కవిత, అరవింద్, హేమంత్ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..
ఎప్పుడు
తేదీ: మార్చి 25వ తేదీ నుంచి 26 వరకు
సమయం: ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 వరకు.
Also Read: Marriage: 'మేం తెలంగాణోళ్లం.. బువ్వ తక్కువ పెడితే అరాచకమే'.. పెళ్లిలో కొట్టుకున్న బంధువులు
హోలీ సందర్భంగా అన్ని మద్యం లభించే ప్రదేశాలు మూసివేస్తుండగా కొన్నింటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయా పోలీస్ కమిషనరేట్ల కమిషనర్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించి తెరచి ఉంచింతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే హోలీకి మద్యం దుకాణాలు మూసివేయడం ఎందుకో తెలుసా? పండుగ నాడు స్నేహితులు, బంధువులంతా మద్యం తాగి ఇబ్బందులకు గురి చేస్తారని, మద్యంమత్తులో ఘర్షణలు, వివాదాలకు కారణమవుతాయనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలా మద్యం దుకాణాలు మూసివేస్తారు.
మద్యం దుకాణాల మూసివేతతోపాటు ఈ హోలీ పండుగ సందర్భంగా పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా చేశారు. ప్రశాంత వాతావరణంలో ఆనందంగా హోలీ పండుగ చేసుకోవాలని సూచించారు. ఇతరులకు బలవంతంగా రంగులు పూయొద్దని, ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. రోడ్లపై బైక్‌లలో తిరుగుతూ అరాచకం చేయొద్దని హెచ్చరించారు. పండుగ వలన ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి