Nallala Odelu:ఈటల మిత్రుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? బీజేపీలో ఏం జరుగుతోంది?

Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో  కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 06:56 AM IST
  • బీజేపీని కాదని కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు
  • ఈటల రాజేందర్ కు సన్నిహితుడిగా ఉన్న ఓదెలు
  • ఓదెలు చేరికను బీజేపీలోని ఓ వర్గం అడ్డుకుందని టాక్
Nallala Odelu:ఈటల మిత్రుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? బీజేపీలో ఏం జరుగుతోంది?

Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో  కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ టూర్ తర్వాత కాంగ్రెస్ బలపడిందని అంటున్నారు. అందుకే టీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇందుకు బలాన్నిస్తోంది. ఓదెలు బాటలోనే మరికొందరు టీఆర్ఎస్ అసంతృప్త నేతలు త్వరలోనే హస్తం గూటికి చేరుతారని అంటున్నారు.

నిజానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఓదెలు సన్నిహితుడు. ఉద్యమంలో ఇద్దరూ కలిసి పని చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదెలును 2018లో పక్కనపెట్టారు కేసీఆర్. నల్లాలను కాదని బాల్కసుమన్ కు చెన్నూరు టికెట్ ఇచ్చారు.అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఓదెలు భార్యను మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా నియమించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సుమన్ తో ఆయనకు విభేదాలు తీవ్రమయ్యాయి. రెండు వర్గాలు ఓపెన్ గానే ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో ఈటల బీజేపీలో చేరినప్పుడే అతనితో పాటు ఓదెలు కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది. రాజేందర్ తో పలుసార్లు సమావేశమయ్యారు ఓదెలు. చర్చలు ముగిశాయని.. బీజేపీలో చేరడమే తరువాయి అనుకున్నారు. ఇంతలోనే సడెన్ గా ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం కావడం.. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం చకచకా జరిగిపోయాయి. ఓదెలు కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. బీజేపీలో చేరుతారని భావించిన ఓదెలు కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్లారన్న దానిపైనా చర్చలు సాగుతున్నాయి.

ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నా ఆయనకు అక్కడి నుంచి సిగ్నల్స్ రాలేదంటున్నారు. ఓదేలును బీజేపీలో చేర్పించాలని ఈటల రాజేందర్ ప్రయత్నించినా.. పార్టీ రాష్ట్ర పెద్దలు స్పందించలేదని తెలుస్తోంది. పార్టీలో నెలకొన్న వర్గపోరే ఇందుకు కారణమంటున్నారు. ఈటల రాజేందర్ కు ఇప్పటికే పార్టీలో సరైన గుర్తింపు లేదనే ప్రచారం ఉంది. బండి సంజయ్ తో ఆయనకు గ్యాప్ వచ్చిందంటున్నారు. అందుకే ఈటల మనుషులను పార్టీలే చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఆయన మనుషులు పార్టీలో చేరితే ఈటల బలపడుతారని కొందరు నేతలు భావిస్తున్నారట. బండి సంజయ్ వర్గం ఈ విషయంలో ఈటలకు అడ్డంకులు స్పష్టించిందని తెలుస్తోంది. అందుకే ఈటల మిత్రుడైన ఓదెలు విషయంలో బీజేపీ పెద్దలు సరిగా స్పందించలేదని చెబుతున్నారు. చెన్నూరు టికెట్ పై హామీ ఇస్తే కాషాయ కండువా కప్పుకునేందుకు ఓదెలు సిద్ధమైనా... అందుకు సంజయ్ ససేమిరా అన్నారని తెలుస్తోంది. ఇదే అదనుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు ఓదెలను తమ వైపు తిప్పుకున్నారని చెబుతున్నారు. చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డ.. ఓదెలును తీసుకుని ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.

ఓదెలు చేరికతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. ఓదెలు బాటలోనే మరికొందరు నేతలు వస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అటు బీజేపీలో మాత్రం ఓదెలు విషయంపై పెద్ద చర్చే నడుస్తోందని సమాచారం. పార్టీలో వర్గపోరు పెరిగిపోయిందని.. ఇది తీవ్ర నష్టం కల్గించే అవకాశం ఉందని కొందరు కమలం నేతలు కలవరపడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో కాంగ్రెస్ తో పోల్చితే బీజేపీ వెనకబడిందనే ప్రచారం  సాగుతోందని.. ఇది జనాల్లోకి వెళితే కాంగ్రెస్ కు మరింత బూస్ట్ వస్తుందని కొందరు బీజేపీ నేతలు భయపడిపోతున్నారు.  రాహుల్‌గాంధీ వరంగల్ సభ తర్వాత కాంగ్రెస్‌కు మళ్లీ జోష్ వచ్చిందనే ప్రచారం గులాబీదళంలోని అసంతృప్త నేతలను హస్తం వైపు వెళ్లేలా చేస్తోందనే అబిప్రాయం రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని స్పీచ్‌లిస్తున్న బీజేపీ నేతలు ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంలో ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు.

READ ALSO: Omicron Variant BA.4:  హైదరాబాద్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బిఎ. 4 కేసు.. దేశంలోనే తొలి కేసుగా గుర్తింపు

READ ALSO: CM KCR National Tour: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గురి.. నేటి నుంచి జాతీయ స్థాయి పర్యటన...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News