Weather Update Today in Telangana: తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి.మీ ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని చెప్పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వడగాళ్ల వర్షానికి తెలంగానంలో పంటలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసి ముద్దవ్వగా.. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ రూ.10 వేలు అందిస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందన్నారు. కానీ సీంఎ కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని, రైతులను కేసీఆర్ ఓదారిస్తే, బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు.
దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తరహా పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని పక్క రాష్ట్రాలలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు హరీశ్ రావు. రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని అన్నారు. వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10 వేలు ప్రకటిస్తే.. 10 వేలు చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సన్నాయి, నొక్కులు నొక్కతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వండని డిమాండ్ చేశారు.
Also Read: Financial Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఆలోపు ఈ పనులు పూర్తి చేయండి
Also Read: MLA Undavalli Sridevi: జగన్ దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయింది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి