Brutal Incident in WGL private Hospital: వరంగల్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుత్రి వైద్యులు, ఆరోగ్యశ్రీ సిబ్బంది కుమ్మక్కై ఓ పేషెంట్ ప్రాణాల మీదకు తెచ్చారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌కు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. అయితే సర్జరీ తర్వాత అతని పరిస్థితి మరింత విషమంగా మారడంతో.. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా డిశ్చార్జి చేశారు. ఇందుకోసం ఆరోగ్యశ్రీ సిబ్బందితో కుమ్మక్కై తప్పుడు రిపోర్ట్ తయారుచేయించారు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద అతనికి సర్జరీ చేశారు. సర్జరీలో భాగంగా అతని పుర్రె పైభాగాన్ని తొలగించారు. అయితే సర్జరీ తర్వాత అతని పరిస్థితి మరింత విషమించింది. ఈ విషయాన్ని దాచి అతన్ని బలవంతంగా డిశ్చార్జి చేసేందుకు ప్రయత్నించారు.
ఆరోగ్యశ్రీలో ఆరు రోజులే ట్రీట్మెంట్ ఉంటుందని... ఆసుపత్రిలో చేరి 6 రోజులు అయిపోయినందునా రోజుకు రూ.1 లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేషెంట్ కుటుంబ సభ్యులకు చెప్పారు. లేనిపక్షంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని ఒత్తిడి తెచ్చారు. అంత డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడంతో పేషెంట్ బంధువులు ఎంజీఎంకు తరలించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ సిబ్బందితో కుమ్మక్కైన ఆసుపత్రి సిబ్బంది తప్పుడు రిపోర్ట్ తయారుచేయించారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
పేషెంట్‌ను ఎంజీఎం తరలించేటప్పటికీ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరో షాకింగ్ ఏంటంటే.. ఆ పేషెంట్ పుర్రె పైభాగం ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండిపోయింది. ఎంజీఎం వైద్యులు వెంటనే అతన్ని వెంటిలేటర్‌పై చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రిపై పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమపై ఆరోపణలను ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Varuntej about f3 movie : ఎఫ్3 ఫ్యామిలీ అంతా కలసి మళ్లీ మళ్లీ చూస్తారు : వరుణ్ తేజ్
Also Read: Banking Rules: నేటి నుంచి కొత్త రూల్స్... ఆ పరిమితి దాటే లావాదేవీలకు ఆధార్, పాన్ తప్పనిసరి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి