Warangal MGM: వరంగల్‌ ఎంజీఎంలో అనూహ్య ఘటన.. సర్జరీకి మత్తు ఇస్తుండగా కార్డియాక్ అరెస్ట్‌తో బాలుడి మృతి..

Boy Dies of Cardiac Arrest: సర్జరీకి ముందు మత్తు మందు ఇస్తున్న సమయంలో బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్ ఎంజీఎంలో చోటు చేసుకుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 7, 2022, 01:29 PM IST
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అనూహ్య ఘటన
  • సర్జరీకి ముందు మత్తు ఇస్తుండగా బాలుడికి కార్డియాక్ అరెస్ట్
  • మృతి చెందిన బాలుడు..
Warangal MGM: వరంగల్‌ ఎంజీఎంలో అనూహ్య ఘటన.. సర్జరీకి మత్తు ఇస్తుండగా కార్డియాక్ అరెస్ట్‌తో బాలుడి మృతి..

Boy Dies of Cardiac Arrest: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ బాలుడు కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. విరిగిన చేతికి సర్జరీ చేసే క్రమంలో మొదట బాలుడికి మత్తు మందు ఇవ్వగా.. ఊహించని విధంగా కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. వెంటనే ఆర్‌‌సీయూకి చేర్చి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి చావుకు కారణమంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగ్యాంతండాకి చెందిన నీహాన్ (8)కి చేయి విరగడంతో అతని తల్లిదండ్రులు ఈ నెల 4న వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుత్రిలో చేర్పించారు. మంగళవారం (సెప్టెంబర్ 6) ఉదయం 10.30గం. సమయంలో వైద్యులు అతని చేతికి సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. సర్జరీకి ముందు అనస్తీషియా ఇవ్వగా.. బాలుడు అకస్మాత్తుగా కార్డియాక్‌ అరెస్ట్‌కి గురయ్యాడు. వెంటనే ఆర్‌సీయూ వార్డుకు తరలించి చికిత్స అందించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

మధ్యాహ్నం 1.10 గం. సమయంలో బాలుడు మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వైద్యులపై తీవ్ర కోపోద్రిక్తులైన బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజీఎం ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ బాలుడి మృతిపై త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించారు.

Also Read: Munugode Bypoll: త్వరగా పెడదామా.. ఆలస్యం చేద్దామా! మునుగోడు ఉప ఎన్నికపై కమలం పార్టీలో కన్ఫ్యూజన్..

Also Read: Delhi Liquor Scam:లిక్కర్ స్కాంలో కవిత జైలుకేనా? ఈడీ చేతిలో రామచంద్ర పిళ్ళైతో బిజినెస్ డీల్ చిట్టా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News