వీఆర్వో పరీక్ష 2018 : ఆ మూడు పరీక్షా కేంద్రాల్లో మార్పు

రేపు టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో పరీక్ష

Last Updated : Sep 15, 2018, 01:44 PM IST
వీఆర్వో పరీక్ష 2018 : ఆ మూడు పరీక్షా కేంద్రాల్లో మార్పు

రేపు టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న వీఆర్వో పరీక్ష నిర్వహణలో స్వల్పమైన మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో 237 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుండగా సరూర్‌నగర్‌లో కేటాయించిన 3 పరీక్షా కేంద్రాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌కు మార్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనున్న పరీక్ష కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కేవలం హైదరాబాద్ జిల్లా నుంచే 99,485 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Trending News