Nagarjuna vs Konda Surekha: తన కుటుంబంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసి.. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి కొండా సురేఖ వ్యవహరించారు. తనపై, తన కుమారుడి వివాహ జీవితంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సహించలేకపోతున్నారు. ఆమెపై బహిరంగ విమర్శలు చేసి ఆగ్రహించినా ఆయన కోపం చల్లారడం లేదు. ఈ క్రమంలోనే కొండా సురేఖను కోర్టుకు లాగారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీంతో కొండా సురేఖ అంశం న్యాయస్థానం బోనులోకి చేరింది.
Also Read: Konda Surekha: నోటి దూల ఎఫెక్ట్.. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా?
రాజకీయ లబ్ధి కోసం ఓ నాయకుడిపై విమర్శలు చేస్తున్న క్రమంలో నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ రాజకీయాల్లోకి లాగారు. ఈ సందర్భంగా నాగ చైతన్య, సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్, విడాకులు ఇలా రెండింటిని కలిపి అతి జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేయడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కుటుంబానికి అండగా నిలబడింది. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అంతా ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్ సమంత స్ట్రాంగ్ వార్నింగ్
అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోగా.. క్షమాపణలు మాత్రం చెప్పకపోవడంతో ఆమె తీరుపై మరింత విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు 'ఇక చాలు వివాదానికి ఇంతటితో ముగింపు పలకండి' అని విజ్ఞప్తి చేసినా కూడా నాగార్జున వెనక్కి తగ్గడం లేదు. ఈ సందర్భంగా కొండా సురేఖను కోర్టుకు లాగారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో నాగార్జున కేసు దాఖలు చేశారు. 'మా కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారు' అంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.