Mattampally: మూగజీవాలకు కూడా ప్రాణం ఉంటదని మరిచారు. నోరు లేదు కదా వాటిని ఇష్టారీతిన కుక్కిపడేశారు. ఒక లారీ కంటైనర్‌లో మొత్తం 26 ఆవులను నింపేశారు. అనంతరం వాటిని వందల కిలోమీటర్ల మేర తరలిస్తున్నారు. దీంతో కంటైనర్లలో ఊపిరాడక ఆ మూగజీవాలు గిలగిలలాడి ప్రాణాలు వదిలాయి. హృదయాలను పిండేసే ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పోలీసుల వాహనాల తనిఖీల్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్ చేయడమే మార్పా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఓ లారీ కంటైనర్ వచ్చింది. దానిని ఆపి పోలీసులు తనిఖీలు చేయగా కంటైనర్‌లో ఆవులు దారుణ స్థితిలో కనిపించాయి. కంటైనర్‌లో మొత్తం 26 ఆవులు కనిపించాయి. ఊపిరాడక విలలాడుతున్న ఆవులు తలుపులు తెరవడంతో ఊరట చెందాయి. అయితే ఊపిరాడక కంటైనర్‌లో 16 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. చనిపోయిన వాటికి పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మిగిలిన ఆవుల్లో ఎనిమిదింటిని నల్గొండలోని గోశాలకు తరలించారు. రెండు ఆవుల కాళ్లు విరగడంతో వాటికి పశువుల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆవులను దారుణ పరిస్థితిలో తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Dashabdi Utsavalu: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. షెడ్యూల్ ఇదే!
పోలీసుల కక్కుర్తి?
అయితే కంటైనర్‌ను మంగళవారం ఉదయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారని సమాచారం. బేరసారాల్లో విషయంలో తేడాలు రావడంతో ఇక పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో సూర్యాపేట జిల్లాలో హాట్ టాపిక్‌గా ఆరింది. అయితే ఉన్నతాధికారి ఆదేశాలతో రాత్రి 8 గంటలకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter