కరీంనగర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. దిండుతో ఊపిరాడకుండా చేసి, ఆపై కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని రాధికను ఎవరు హత్యచేసి డ్రామాలాడారో పోలీసులు తెలుసుకుని షాకయ్యారు. కన్నతండ్రే ఈ దారుణానికి ఒడిగట్టడమే ఇందుకు కారణం. కానీ కూతురి హత్య, ఇంట్లో చోరీ జరిగిందని కేసును తప్పుదోవ పట్టించి తమపై ఏ అనుమానం రాకుండా ఆ తండ్రి చేసిన నటనకు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి 10న స్థానిక విద్యానగర్‌లో రాధిక దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.
See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?
నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత సీపీ కమలాసన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రాధిక హత్య కేసును టెక్నాలజీ సాయంతో ఛేదించినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన తండ్రి ఇంట్లో చోరీ జరిగిందని చెప్పడంతో ఈ కోణంలో దర్యాప్తు చేపట్టామన్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించకపోవడంతో తండ్రి కొమరయ్యపై ఏ అనుమానం రాలేదన్నారు. అయితే అతడే కన్నకూతుర్ని దిండుతో ఊపిరాడకుండా చేసి, ఆపై గొంతుకోసి దారుణంగా హత్య చేశాడని సీపీ వెల్లడించారు.
Also Read: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. ప్రేమోన్మాది ఘాతుకమేనా?
రాధిక ఓ యువకుడిని ప్రేమించడం, ఆమె వైద్యానికయ్యే ఖర్చులు, పెళ్లిచేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఇలా ఆలోచించి కూతురు రాధికను తండ్రి కొమరయ్య పథకం ప్రకారమే హత్య చేశాడని వివరించారు. ఇంట్లో లక్ష రూపాయలు, బంగారం చోరీ జరిగిందని సైతం 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలోనే దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో 60 మందిని విచారించారు, 200 మందికి పైగా కాల్ డేటాను పరిశీలించారు. కానీ కన్నతండ్రే హంతకుడని తేల్చారు.
అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ
పోలీసులు విచారణలో ప్రతిసారి పొంతన లేని సమాధానాలు రావడంతో కొమరయ్యను తమదైనశైలిలో విచారించే సరికి నేరాన్ని అంగీకరించాడు. కొమరయ్య చెప్పులు, బనియన్‌పై కంటికి కనిపించని రక్తపు మరకలను టెక్నాలజీతో గుర్తించి, డీఎన్ఏతో చెక్ చేయగా అసలు విషయం తెలిసిందని సీపీ కమలాసన్ వివరించారు. మూడు వారాలపాటు 8 బృందాలుగా ఏర్పడి దాదాపు 80 పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తే తప్ప అసలు విషయం బయటపడలేంటే కొమరయ్య ఎంత జాగ్రత్త పడ్డాడో తెలుస్తోంది.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
ఈ కేసు నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక క్లూస్‌టీం బృందాలను రప్పించగా వారు జర్మనీ టెక్నాలజీని వినియోగించి రక్తపు మరకల చెప్పులు, బనియన్‌తో తండ్రి కొమరయ్య హంతకుడని తేల్చేశారు. 3 వారాలు అహర్నిశలు శ్రమించిన పోలీసులు అసలు నిందితుడే తండ్రేనని, అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగడ్డాడో తెలుసుకుని పోలీసులు షాకయ్యారంటే కొమరయ్య ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో తెలుస్తోంది.
రాధిక హత్యకేసు.. పోలీసులకు కన్నతండ్రి ట్విస్ట్!