/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Delhi Liquor Scam: ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తుపోయే విషయాలు బయిటికి వస్తున్నాయి. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరిస్తోంది సీబీఐ. ఈ కేసులో 14 మందితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సీబీఐ. ఏ1గా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను చేర్చింది. ఢిల్లీలో మనీశ్ సిసోడియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయడపడుతున్నాయి. ఈ డీల్ వెనుక ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది.

లిక్కర్ స్కాంలో ఏ14గా హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి రామచంద్ర పిళ్లైని చేర్చింది సీబీఐ. కోకాపేటలోని అతని నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. దాదాపు 20 గంటలకు పైగా సాగిన సోదాల్లో రామచంద్ర పిళ్లై ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలుస్తోంది. అతని ద్వారానే ఢిల్లీ ప్రభుత్వంతో తెలంగాణ ఎమ్మెల్యేలు డీల్ నడిపించారని తెలుస్తోంది. ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగినట్లు తెలుస్తోన్న సమయంలో ఎక్సైజ్ కమిషనర్ గా తెలంగాణ ఐఏఎస్ గోపికృష్ణ ఉన్నారు. ఈ స్కాంలో ఆయనే కీ రోల్ పోషించారనే ఆరోపణలు వస్తున్నా.యి. లిక్కర్ టెండర్లను కేటాయించడానికి  ఓ మధ్యవర్తి ద్వారా మనీష్ సిసోడియా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే కేజ్రీవాల్ సర్కార్ మద్యం పాలసీని మార్చింది. మద్యం వ్యాపారం నుంచి ప్రభుత్వం తప్పుకుంది. జోన్ల వారీగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. ఒక్కో జోన్ లో ఎన్ని షాపులైనా పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన లిక్కర్ వ్యాపారులు, ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు జోన్ల వారీగా లైసన్సులు ఇప్పించడం, కేటగిరి మార్చడం వంటి పనులను తెలంగాణ ఎమ్మెల్యేలే మనీశ్ సిసోడియా ద్వారా చేయించారని తెలుస్తోంది. ఢిల్లీలోఉన్న మద్యం షాపుల్లో 10మంది తెలంగాణ వ్యాపారులకు వాటాలు ఉన్నాయమి సీబీఐ విచారణలో తేలిందంటున్నారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్ లోని పలు హోటళల్లోన  ఈ డీల్స్ జరిగాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని.. దాదాపు 144 కోట్ల రూపాయలు ప్రభుత్వంలోన కీలక నేతలకు అందాయని సీబీఐకి ఫిర్యాదు అందింది. మద్యం లైసెన్స్ కోసం డిపాజిట్ చేసిన 30 కోట్ల రూపాయలను మంత్రివర్గం ఆమోదం లేకుండా బిడ్డర్ కు తిరిగి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

మద్యం పాలసీలో మార్పులు చేసిన ఆప్ సర్కార్.. లైసెన్స్ కు 12% ఉన్న ట్యాక్స్ ను 6 శాతానికి తగ్గించడం వెనుక కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మద్యం డీల్స్ తో వచ్చిన వందల కోట్ల రూపాయలను  గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని తెలిపింది.  రాబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల కోసం పెద్దమొత్తంలో డబ్బును కూడబెట్టిందన్నది కమలనాధుల ఆరోపణ. లిక్కర్ స్కాంలో తెలంగాణ నేతలకు  లింకులు ఉన్నాయని.. హైదరాబాద్ లోనే డీల్స్ జరిగాయని.. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పలు సార్లు హైదరాబాద్ వెళ్లారని ఢిల్లీ బీజేపీ ఎంపీ  సర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ  ఆరోపించారు. దీంతో సిసోడియా, ఆయన అనుచరులు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తిరిగారు.. ఏ హోటల్ లో బస చేశారు అన్న వివరాలను సీబీఐ ఆరా తీసిందని తెలుస్తోంది. హోటల్స్ లో సిసోడియా అనుచరులు పెద్ద ఎత్తున గదులు బుక్ చేసుకున్నారని గుర్తించిన సీబీఐ... ఆ రోజు హోటల్ కు ఎవరెవరు వచ్చారు.. ఎంత సేపు ఉన్నారు అన్న వివరాలు తీసుకున్నారు. లిక్కర్ డీల్స్ వెనుక 10 నుంచి 15 మంది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని సీబీఐ గుర్తించిందని తెలుస్తోంది. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పక్కా ఆధారాలు ఉన్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు గత మే నెలలో ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ ఇచ్చిన లంచ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం బయటికి రావడం, తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకు ఉందని తేలడంతో.. కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశంపైనా బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో సెగలు రేపుతున్న లిక్కర్ స్కాం.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. సీబీఐ విచారణలో ఇంకా ఎంతమంది బండారం బయటపడుతుందోనన్న చర్చలు సాగుతున్నాయి.

Also Read : Munugode Bypoll: కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Two Telangana MLAs in Delhi Liquor Scam.. Bjp Alligations On KCR, Kejriwal Meeting
News Source: 
Home Title: 

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు.. కేజ్రీవాల్ తో  కేసీఆర్ మీటింగ్ అందుకేనా?

 Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు.. కేజ్రీవాల్ తో  కేసీఆర్ మీటింగ్ అందుకేనా?
Caption: 
delhi liquor scam
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింక్స్

మద్యం వ్యాపారులతో ఇద్దరు ఎమ్మెల్యేల డీల్?

హైదరాబాద్ లోనే డీల్స్ జరిగినట్లు అనుమానం

Mobile Title: 
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు?
Srisailam
Publish Later: 
No
Publish At: 
Saturday, August 20, 2022 - 10:22
Request Count: 
77
Is Breaking News: 
No