TSRTC: ప్రయాణిలకు గుడ్‌న్యూస్.. తొలిసారి అందుబాటులోకి ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే

TSRTC AC Sleeper Bus: టీఎస్‌ఆర్టీసీ సరికొత్త బస్సులను ప్రవేశపెట్టనుంది. అత్యాధునిక వసతులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం ఈ బస్సులు ప్రారంభంకానున్నాయి. బస్సులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి..? ఏయే నగరాలకు అందుబాటులోకి రానున్నాయి..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 11:39 AM IST
TSRTC: ప్రయాణిలకు గుడ్‌న్యూస్.. తొలిసారి అందుబాటులోకి ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే

TSRTC AC Sleeper Bus: ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను వినియోగంలోకి తీసుకురానుంద. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేయనుంది.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు 'లహరి-అమ్మఒడి అనుభూతి'గా నామకరణం చేసింది. 

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు  ఈ కొత్త ఏసీ స్లీపర్‌ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. 

ఉచిత వై-ఫై సదుపాయం..!

తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న ఏసీ స్లీపర్‌ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించడం జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. 

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే  సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు తెలిపేలా బస్సు ముందు, వెనక ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులుంటారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్‌డీఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో  ఉంటుంది.

Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News