హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసి చేపట్టిన సమ్మె నేటితో ఐదో రోజుకు చేరడమే కాకుండా మరింత ఉధృతమైంది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆర్టీసీ కార్మికుల భవిష్యత్, కార్మికులతో పోరాటం చేసే అంశంపై చర్చిస్తున్నారు. 26 డిమాండ్లతో పాటు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమ్మెపై ఆర్టీసి కార్మిక సంఘాలు మాట్లాడుతూ.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని.. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగడానికైనా తాము సిద్ధమేనని చెబుతున్నారు.