TSRTC Ticket Discounts: సంక్రాంతి బంపర్ బొనాంజా.. టీఎస్‌ఆర్‌టీసీ టికెట్లపై సూపర్ డిస్కౌంట్!

TSRTC offers buses at discounted charge for Sankranti 2023. సంక్రాంతి 2023 పర్వదినం సందర్బంగా సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 27, 2022, 10:04 AM IST
  • టీఎస్‌ఆర్‌టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్
  • సంక్రాంతి బంపర్ బొనాంజా
  • టికెట్లపై సూపర్ డిస్కౌంట్
TSRTC Ticket Discounts: సంక్రాంతి బంపర్ బొనాంజా.. టీఎస్‌ఆర్‌టీసీ టికెట్లపై సూపర్ డిస్కౌంట్!

TSRTC offers 10 Percent Discount On Return Journey Ticket: 'సంక్రాంతి' పండుగకు హైదరాబాద్ మహా నగరం సహా పలు నగరాల నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పండుగ సమయానికి బస్సులు, ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణీకులతో కిటకిటలాడనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రైవేట్ ట్రావెల్స్ భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లనున్న నేపథ్యంలో.. వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుళకు టీఎస్‌ఆర్‌టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ అడ్వాన్స్‌డ్ టికెట్ల రిజ‌ర్వేష‌న్ స‌దుపాయం క‌ల్పించింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. 10 శాతం రాయితీని కల్పించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ 10 శాతం రాయితీ తిరుగు ప్రయాణంపై మాత్రమే వర్తిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ బుకింగ్‌కి ఈ రాయితీ వర్తిస్తుంది. 2023 జనవరి 31 వరకు ఈ రాయితీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

సంక్రాంతి 2023 పర్వదినం సందర్బంగా సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఓ ప్రకటనలో తెలిపారు. 10 శాతం రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ముందస్తు రిజర్వేషన్ లేదా మరింత సమాచారం కొరకు www.tsrtconline.inని సంప్రదించాలని వారు కోరారు. 

Also Read: Tuesday Remedies: పొరపాటున కూడా ఈ 5 వస్తువులను మంగళవారం కొనొద్దు.. కొంటే కష్టాలను కొని తెచుకున్నట్టే!  

Also Read: President Telangana Schedule Today: తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన.. నేటి షెడ్యూల్‌ ఇదే!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News