హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కార్మికుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వంపై ఉందని.. ఇక ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. డ్యూటీ చాట్, అటెండెంట్ రిజిస్టర్‌పై మాత్రమే సంతకం పెడతామని తేల్చిచెప్పిన ఆయన.. ప్రభుత్వం షరతులు లేకుండా విధులకు ఆహ్వానించినట్టయితే సమ్మె విరమించడానికి మేము సిద్దంగా ఉన్నామని స్పష్టంచేశారు.
Read also : TSRTC strike: కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. పరిష్కారం కోరిన జేపి
ఆర్టీసీ కార్మికుల సమస్యలను లేబర్ కోర్టు పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని అశ్వత్థామ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సమ్మె కాలానికి సంబంధించిన జీతాల చెల్లింపు విషయాన్ని లేబర్ కోర్టులో లేవనెత్తుతాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదని.. ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.